Ayodhya 14 Kosi Parikrama 2023 : ఉత్తర్‌ప్రదేశ్‌లోని శ్రీరామ జన్మభూమి అయోధ్య నగర ప్రదక్షిణ (14 కోసి పరిక్రమ) కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతోంది. లక్షలాది మంది భక్తులు.. రామ నామస్మరణ చేసుకుంటూ 45 కిలోమీటర్లు నడుస్తున్నారు. మంగళవారం వేకువజామున 2.09 గంటలకు శుభముహుర్తంగా పూజారులు ఖరారు చేసినప్పటికీ.. అంతకు ముందే భక్తులు ప్రదక్షిణ ప్రారంభించారు. ఏటా కార్తిక మాస నవమి నాడు ఈ కార్యక్రమం అయోధ్యలో నిర్వహిస్తుంటారు.
50 లక్షలకుపైగా భక్తులు!
Ayodhya 14 Kosi Parikrama 2023 Date And Time : కార్తిక నవమి రోజున అనేక మంది ప్రజలు.. పూజలు, ఉపవాసాలు, దానధర్మాలు చేస్తుంటారు. నవమి రోజు అలా చేస్తే పుణ్యం లభిస్తుందని నమ్ముతారు. ఆ పుణ్యం ఎప్పటికీ పోదని విశ్వసిస్తారు. అందుకే ఏటా అయోధ్యకు ప్రదక్షిణలు చేయడానికి ప్రజలు తండోపతండాలుగా వస్తారని స్థానికులు చెబుతున్నారు. ఈ ఏడాది 50 లక్షల మందికి పైగా భక్తులు ప్రదక్షిణలు చేస్తారని అంచనా వేస్తున్నారు.
పటిష్ఠ భద్రతా ఏర్పాట్లు.. అనేక జాగ్రత్తలు
Ayodhya 14 Kosi Parikrama Marg : అయితే అయోధ్య నగర ప్రదక్షిణ కోసం అధికారులు.. పటిష్ఠంగా భద్రతా ఏర్పాట్లు చేశారు. దాదాపు 45 కిలోమీటర్ల ప్రదక్షిణ మార్గంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. రోడ్డుపై దుమ్ము ఎగిసిపడకుండా నీరు చల్లేందుకు మనుషులను నియమించారు. ప్రజలకు తాగునీరు అందించే బాధ్యతను ఎస్డీఆర్ఎఫ్ సిబ్బందికి అప్పగించారు. ప్రదక్షిణ మార్గంలో పలు చోట్ల వైద్య శిబిరాలను ఏర్పాటు చేశారు. వీటితో పాటు స్థానిక ప్రజలు.. భక్తులకు ఆహార పదార్థాలను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు.
క్రేన్ వ్యూ చిత్రాలు..
Ayodhya Ram Mandir Construction Status : మరోవైపు, అయోధ్యలో భవ్య రామ మందిర నిర్మాణం శరవేగంగా జరుగుతోంది. డిసెంబర్ 15వ తేదీ కల్లా పూర్తి చేయనున్నట్లు అధికారులు ఇదివరకే ప్రకటించారు. 2024 జనవరి 22వ తేదీన జరగనున్న రామ్‌లల్లా ప్రాణప్రతిష్టాపనకు ఏర్పాట్లు ఘనంగా జరుగుతున్నాయి. అయితే రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు.. నిర్మాణ చిత్రాలను తాజాగా షేర్ చేసింది. క్రేన్ ద్వారా పై నుంచి తీసిన (క్రేన్ వ్యూ) చిత్రాలను ఎక్స్‌లో పోస్ట్ చేసింది.
-
Crane view of under construction Shri Ram Janmabhoomi Mandir.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 20, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
निर्माणाधीन श्री राम जन्मभूमि मंदिर के क्रेन से लिए गए कुछ चित्र pic.twitter.com/rPj2f365XT
">Crane view of under construction Shri Ram Janmabhoomi Mandir.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 20, 2023
निर्माणाधीन श्री राम जन्मभूमि मंदिर के क्रेन से लिए गए कुछ चित्र pic.twitter.com/rPj2f365XTCrane view of under construction Shri Ram Janmabhoomi Mandir.
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 20, 2023
निर्माणाधीन श्री राम जन्मभूमि मंदिर के क्रेन से लिए गए कुछ चित्र pic.twitter.com/rPj2f365XT
అర్చక పోస్టులకు 3 వేల మంది దరఖాస్తు
Ayodhya Ram Mandir Pujari Post : రామ మందిరంలో అర్చకుల పోస్టులకు సంబంధించి దాదాపు 3 వేల మంది దరఖాస్తు చేసుకున్నట్లు.. రామ మందిర తీర్థ క్షేత్ర ట్రస్టు ఓ ప్రకటనలో తెలిపింది. వీరిలో 200 మందిని మెరిట్ ప్రాతిపదికన ఎంపిక చేసి ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు వెల్లడించింది. వీరిలో 20 మందిని ఎంపిక చేయనున్నట్లు ట్రస్టు ప్రతినిధులు తెలిపారు.
-
शुभ दीपावली
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023 " class="align-text-top noRightClick twitterSection" data="
Shubh Deepawali pic.twitter.com/ReRJ8CBKRO
">शुभ दीपावली
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023
Shubh Deepawali pic.twitter.com/ReRJ8CBKROशुभ दीपावली
— Shri Ram Janmbhoomi Teerth Kshetra (@ShriRamTeerth) November 12, 2023
Shubh Deepawali pic.twitter.com/ReRJ8CBKRO
రామమందిరం ఓపెనింగ్‌కు 10కోట్ల కుటుంబాలకు ఆహ్వానం- విదేశాల్లోని హిందువులకు కూడా!
అయోధ్యలో రామయ్య ప్రాణప్రతిష్ఠకు ముహుర్తం ఫిక్స్- మోదీ చేతుల మీదుగా