ETV Bharat / bharat

కేరళ పర్యాటక ప్రాజెక్టుకు డబ్ల్యూటీఎం పురస్కారం - అయమానమ్‌ గ్రామం

కేరళలోని అయమానమ్​ గ్రామం వరల్డ్ ట్రావెల్​ మార్కెట్​​(డబ్ల్యూటీఎం) టూరిజం అవార్డును గెలుచుకుంది. లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో ఈ పురస్కారం అందుకున్నారు టూరిజం డైరెక్టర్‌ కృష్ణతేజ.

Aymanam village
అయమానమ్​ పర్యాటక ప్రాజెక్టు
author img

By

Published : Nov 3, 2021, 9:07 AM IST

Updated : Nov 3, 2021, 9:24 AM IST

కేరళ కొట్టాయం జిల్లాలోని అయమానమ్‌ నమూనా బాధ్యతాయుత గ్రామీణ పర్యటక ప్రాజెక్టుకు ప్రతిష్ఠాత్మక వరల్డ్‌ ట్రావెల్‌ మార్కెట్‌ (డబ్ల్యూటీఎం) పర్యాటక పురస్కారం లభించింది. ఈ మేరకు లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో కేరళ టూరిజం డైరెక్టర్‌ కృష్ణతేజ అవార్డును అందుకున్నారు.

Aymanam village in Kerala
పురస్కారాన్ని స్వీకరిస్తున్న కేరళ టూరిజం డైరెక్టర్‌ కృష్ణతేజ

సీఎం పినరయి విజయన్​.. అయమానమ్​ను మోడల్ రెస్పాన్సిబుల్ టూరిజం గ్రామంగా ప్రకటించిన 14 నెలల తర్వాత ఈ ప్రాజెక్టుకు అంతర్జాతీయ గుర్తింపు లభించింది. స్థానిక ప్రజలు ఉపాధి, పర్యటక ప్రాంతాలు పర్యావరణ పరిరక్షణకు దోహదపడేలా సంస్కృతిని పెంపొందించింది. అంతేకాదు పర్యాటక మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తోంది. ఇందుకుగాను అయమానమ్​ గ్రామం.. డబ్ల్యూటీఓ అవార్డును సొంతం చేసుకుంది.

కేరళ పర్యటక శాఖకు చెందిన బాధ్యతాయుత పర్యాటక కార్యక్రమం కింద 'అయమానమ్‌' ప్రాజెక్టు చేపట్టారు. కొవిడ్‌-19 ఉద్ధృతి కారణంగా గతేడాది తీవ్రంగా దెబ్బతిన్న కేరళ టూరిజం ఈ పురస్కారంతో పునరుజ్జీవం చెందుతుందని ఆ రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి పీఏ మహమద్‌ రియాస్‌ ఆశాభావం వ్యక్తం చేశారు. పరిశ్రమ వీలైనంత త్వరగా గాడిలో పడాలని కోరుకుంటున్నట్లు స్పష్టంచేశారు.

ఇదీ చూడండి: 'మనం మరణించాకే పిల్లలకు ఆస్తి ఇవ్వాలి'

Last Updated : Nov 3, 2021, 9:24 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.