ETV Bharat / bharat

మద్యం వద్దు.. పాలు ముద్దు.. రావణుని న్యూ ఇయర్​ సందేశం!

author img

By

Published : Jan 1, 2022, 2:44 PM IST

Updated : Jan 1, 2022, 10:04 PM IST

Awareness on Acohol on The eve of New Year : న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా మహారాష్ట్ర పుణెలో ఓ వ్యక్తి రావణుడి అవతారమెత్తాడు. ఓ చేత్తో కత్తి మరో చేత్తో పాలు పట్టుకుని రోడ్లపై సంచరించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర ప్రజలకు పాలు పంచుతూ మంచి సందేశం ఇస్తున్నాడు.

man dressed up as Ravana
రావణుని సందేశం

Awareness on Acohol on The Eve of New Year: దేశమంతటా న్యూ ఇయర్​ వేడుకలను ప్రజలు ఘనంగా జరుపుకొంటున్నారు. బాణసంచా కాల్చుతూ విద్యుత్ వెలుగుల్లో సంబరాలు చేసుకుంటున్నారు. అయితే.. ఇది ఒక వైపు మాత్రమే.. కొత్త సంవత్సరం సందర్భంగా మద్యం ఏరులై పారుతోంది. ఆల్కహాల్​ సేవించే వారి సంఖ్య గణనీయంగా పెరుగుతోంది. ఫలితంగా ఎన్నో ప్రమాదాలు జరిగి అనేక కుటుంబాల్లో విషాద ఛాయలు అలుముకుంటున్నాయి.

man dressed up as Ravana
రావణుని న్యూ ఇయర్​ సందేశం

awareness on alcoholism: ఇలాంటి పరిస్థితిలో మద్యం సేవించకుండా అవగాహన కల్పించడానికి మహరాష్ట్ర పుణెకు చెందిన ఓ వ్యక్తి.. సరికొత్త అవతారం ఎత్తాడు. రావణుడి వేషం వేసుకుని మద్యానికి బదులు పాలు సేవించాలని ప్రచారం చేశాడు. ఓ చేత్తో కత్తి, మరో చేతిలో పాల ప్యాకెట్లను పట్టుకుని రహదారులపై సంచరించాడు. ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర పాల ప్యాకెట్లను పంచిపెట్టాడు. 'పాలు ముద్దు .. ఆల్కహాల్ వద్దు' అనే నినాదంతో ప్రజలకు మంచి సందేశం ఇచ్చే ప్రయత్నం చేశాడు. మద్యం​ అలవాటును వీడాలని పిలుపునిచ్చాడు.

man dressed up as Ravana
మద్యం, కరోనా పట్ల అవగాహన కార్యక్రమం

"నేను రాక్షసుని వేషం వేశాను. మీలోని రాక్షసున్ని తొలగించండి. ఆల్కహాల్​ అలవాటును మానేయండి. పాలు తాగండి ఆరోగ్యంగా ఉంటారు. చిన్నతనంలో అమ్మ నుంచి పాలుతాగితేనే పెద్దవాళ్లమయ్యాము."

- అరుణ్ వోహార్​​

"ఆల్కహాల్ అలవాటు కారణంగా సమాజంలో చాలా కుటుంబాలు విచ్ఛిన్నం అవుతున్నాయి. ఈ కార్యక్రమం ద్వారా ఆల్కహాల్​ను మానిపించే ప్రయత్నం చేస్తున్నారు. డిసెంబర్ 31న ప్రజలు ఆల్కహాల్ సేవించకుండా అవగాహన కల్పిస్తున్నారు."

-స్థానిక నాయకుడు

awareness of risk alcohol: అయితే.. అరుణ్ చేసే ప్రయత్నానికి ఓ ఎన్​జీఓ సంస్థ కూడా సహకరించింది. ఎన్​జీఓ సభ్యులు ఈ కార్యక్రమంలో భాగమయ్యారు. మహారాష్ట్రలో కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో న్యూ ఇయర్ వేడుకల సందర్భంగా కరోనా నిబంధనలు పట్ల ప్రజలకు అవగాహన కల్పించారు.

man dressed up as Ravana
మద్యం తాగవద్దని ఫ్లకార్డులు

ఇదీ చదవండి: మాతా వైష్ణోదేవి ఆలయంలో తొక్కిసలాట- 12మంది మృతి

Last Updated : Jan 1, 2022, 10:04 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.