ETV Bharat / bharat

అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి- తుపాకులతో దుండగుల బీభత్సం! - ఎంఐఎం ఎంపీ ఒవైసీ

Asaduddin Owaisi
అసదుద్దీన్​ ఒవైసీపై హత్యాయత్నం
author img

By

Published : Feb 3, 2022, 6:07 PM IST

Updated : Feb 3, 2022, 10:55 PM IST

18:03 February 03

అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి

అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి

Attack on Asaduddin Owaisi: ఏఐఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ కారుపై దాడి జరిగింది. ఉత్తర్​ప్రదేశ్​ నుంచి దిల్లీ వెళ్తుండగా.. ఛాజర్సీ టోల్​గేట్ వద్ద ఇద్దరు వ్యక్తులు తన కారుపై కాల్పులు జరిపినట్లు ఆయన వెల్లడించారు. 3-4 తూటాలు దూసుకెళ్లాయని చెప్పారు.

"యూపీ మేరఠ్​లోని కిథౌర్​లో ఎన్నికల ప్రచారం ముగించుకుని దిల్లీ బయలుదేరాను. ఛాజర్సీ టోల్​గేట్​ వద్ద నా వాహనంపై ఇద్దరు వ్యక్తులు కాల్పులు జరిపారు. 3-4 రౌండ్లు తూటాలు దూసుకెళ్లాయి. నా వాహనం టైర్లు పంక్చర్ అయ్యాయి. నేను వేరే వాహనంలో వెళ్లిపోయాను. దాడి చేసేందుకు వచ్చిన వారు మొత్తం ముగ్గురు-నలుగురు ఉన్నారు." అని ఏఎన్​ఐ వార్తా సంస్థతో చెప్పారు అసదుద్దీన్.

ఎన్నికల సంఘానికి విజ్ఞప్తి..

కాల్పుల ఘటనపై ఎన్నికల సంఘం స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని ఒవైసీ విజ్ఞప్తి చేశారు. ఈ దర్యాప్తు చేపట్టాల్సిన బాధ్యత మోదీ, యూపీ ప్రభుత్వాలపై ఉందన్నారు. ఈ విషయంపై లోక్​సభ స్పీకర్​ ఓం బిర్లాను కూడా కలుస్తానని ఎంఐఎం అధినేత వెల్లడించారు.

కాల్పులు జరిపిన వారిలో ఒకరిని అరెస్ట్​ చేశామని పోలీసులు తనకు చెప్పినట్లు ఒవైసీ పేర్కొన్నారు. అతని నుంచి పలు ఆయుధాలు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు.

Last Updated : Feb 3, 2022, 10:55 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.