Old Lady Tree Climbing: ఇక్కడ కొబ్బరి చెట్టు ఎక్కుతున్న బామ్మ పేరు మరియమ్మకుట్టి. కేరళ ఇడుక్కి జిల్లా ఇరుంబుపాలెం నివాసి. వయసు 68 ఏళ్లు. సాధారణంగా ఈ వయస్సులోనివారిలో కొందరు వారి పని వారు చేసుకోవడానికే ఇబ్బంది పడుతుంటారు. అయితే ఈ బామ్మ మాత్రం అందుకు భిన్నం. 68 ఏళ్ల వయసులోనూ కొబ్బరి చెట్టు ఎక్కి కాయలను కోస్తున్నారు. పార పట్టి వ్యవసాయం చేస్తున్నారు.
22 ఏళ్ల వయస్సులోనే మరియమ్మకుట్టి రైతుగా మారారు. పెళ్లైన కొన్నేళ్లకే భర్త చనిపోవడంతో ఇద్దరు పిల్లల పోషణ తనపైనే పడింది. అయినా ఆమె భయపడలేదు. ప్రతికూల పరిస్థితుల్లోనూ మొక్కవోని ధైర్యంతో సాగులో రాణించారు. మూడన్నర ఎకరాల భూమిలో వ్యవసాయం ప్రారంభించారు. ఆరుగంటలకు నిద్రలేచిన మొదలు పని ప్రారంభిస్తారు. పశువులు, మేకలను చూసుకుంటుంది. పార పట్టి వ్యవసాయం చేస్తారు.
తన తోటలోని కొబ్బరికాయలు కోసేందుకు సైతం ఆమె ఇతరులపై ఆధారపడటం లేదు. కేరళ మహిళా స్వయం సహాయ బృందం శిక్షణకు హాజరై కొన్ని సంవత్సరాల క్రితమే కొబ్బరి చెట్టు ఎక్కడం నేర్చుకున్నారు. ఆమె ఆసక్తి గమనించిన వారు చెట్టు ఎక్కేందుకు ఉపయోగించే పరికరాన్ని బహూకరించారు. సుమారు 7 పదుల వయస్సు వచ్చినా ఆమె ఇప్పటికీ రోజంతా పొలం పనులు చేస్తూనే ఉన్నారు.
ఇదీ చూడండి:
మద్యానికి డబ్బులివ్వలేదని కన్నతల్లిని కడతేర్చిన కుమారుడు
ఫుట్బాల్ మ్యాచ్లో విషాదం.. గ్యాలరీ కూలి 60 మందికి గాయాలు!