ETV Bharat / bharat

12 ఏళ్ల బాలికపై హత్యాచారం.. సెప్టిక్​ ట్యాంక్​లో మృతదేహం.. నిందితుడిపై కాల్పులు - అసోంలో మైనర్​పై రేప్​ ఆపై మర్డర్​

12 ఏళ్ల బాలికను హత్యాచారం చేసిన నిందితుడిని అసోం పోలీసులు అరెస్టు చేశారు. ఆ తర్వాత పారిపోతుండగా కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు. మరోవైపు, కేరళలోని కన్నూర్​లో ఓ బి.కామ్ విద్యార్థిని హత్య చేసిన నిందితులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.

A brutal incident in Tinsukia Assam
A brutal incident in Tinsukia Assam
author img

By

Published : May 4, 2023, 11:00 PM IST

అసోంలో అమానుష ఘటన జరిగింది. 12 ఏళ్ల బాలికపై ఓ కామాంధుడు హత్యాచారానికి పాల్పడ్డాడు. అనంతరం బాలిక మృతదేహాన్ని సెప్టెక్​ ట్యాంక్​లో పడేశాడు. ఈ ఘటనతో స్థానికంగా విషాద ఛాయలు అలుముకున్నాయి.
పోలీసులు తెలిపిన సమాచారం ప్రకారం.. తిన్​సుకియా జిల్లా మార్గరీటా పోలీస్​ స్టేషన్​ పరిధిలో అనన్ అనే వ్యక్తి తన భార్యతో కలిసి నివసిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన ఓ 12 ఏళ్ల బాలికను అనన్​ రేప్​ చేసి చంపాడు. అనంతరం మృతదేహాన్ని సెప్టింగ్ ట్యాంగ్​లో పడేశాడు. ఈ ఘటనపై రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళనలు జరిగాయి. వేలాది మంది రోడ్లపైకి వచ్చి నిరసన తెలిపారు. నిందితుడిని అరెస్టు చేయాలని డిమాండ్​ చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు అరుణాచల్​ప్రదేశ్​లో నిందితుడిని కస్టడీలోకి తీసుకున్నారు. ఆ తర్వాత పారిపోవాలని ప్రయత్నించిన నిందితుడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన నిందితుడిని స్థానిక ఆస్పత్రికి తరలించారు.

నిందితుడు అనన్.. తన భార్యతో పాటు మార్గరీటా పోలీస్​ స్టేషన్​ పరిధిలో నివసిస్తున్నాడు. అతడి భార్య, బాధితురాలి తల్లి పనిమనుషులు. మే 1 మంగళవారం రోజు బాలికను అనన్​ ఇంటి వద్ద ఉంచి ఇద్దరూ పనికోసం బయటకు వెళ్లారు. తిరిగి వచ్చి చూస్తే బాలిక కనబడలేదు. దీనిపై అనన్​ను అడగగా.. బాలిన తన సొంత ఇంటికి వెళ్లిందని చెప్పాడు. ఆ ఇంట్లో వెతికినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో బాలిక తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ విషయం తెలుసుకున్న నిందితుడు పరారయ్యాడు.

కేసు తీవ్రత దృష్ట్యా సీరియస్​గా తీసుకున్న పోలీసులు రంగంలోకి దిగి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో అనన్​పై స్థానికులు అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం తమదైన శైలిలో అతడి భార్యను పోలీసులు విచారించారు. దీంతో ఆమె నేరాన్ని అంగీకరించింది. అనన్​ పారిపోయాడని తెలిపింది. అనన్​ భార్య వాంగ్మూలం మేరకు జయనగర్​లోని ఓ ఇంటి సెప్టిక్​ ట్యాంక్​ నుంచి బాలిక మృతదేహాన్ని బయటకు తీశారు పోలీసులు.

పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడం కోసం సిట్​ (స్పెషల్​ ఇన్వెస్టిగేటివ్​ టీమ్​)ను ఏర్పాటు చేశారు పోలీసులు. అందులో ఐదు బృందాలను ఏర్పాటు చేసి అసోం, అరుణాచల్​ బోర్డర్​లో గాలింపు చేపట్టారు. గురువారం సాయంత్రం అరుణాచల్​ప్రదేశ్​ తిరప్​ జిల్లా దియోమలి టౌన్ వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. అతడిని తిన్​సుకియాకు తీసుకువస్తున్న క్రమంలో తప్పించుకోవాలని ప్రయత్నించాడు నిందితుడు. దీంతో అతడిపై పోలీసులు కాల్పులు జరిపారు. తీవ్రంగా గాయపడిన అనన్​ను స్థానిక ఆస్పత్రికి తరలించారు. ​

బి.కామ్ విద్యార్థి హత్య.. నిందితుల అరెస్ట్​..
కేరళలో సంచలనంగా మారిన ఓ బి.కామ్​ విద్యార్థిని చంపిన కేసులో ఇద్దురు నిందితులను పోలీసులు కన్నూర్​లో అరెస్టు చేశారు. మే 2న సుబ్బలక్షి అనే బి.కామ్​ స్టూడెంట్​ను ఆమె బాయ్​ఫ్రెండ్​ సజయ్​, అతడి భార్య రేష్మ హత్య చేశారు. అనంతరం ఇద్దరు పారిపోయారు. వీరు ఉపయోగించిన ఓ బైక్​ను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను తమిళనాడు పోలీసులకు అప్పగించారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.