ETV Bharat / bharat

నేడు 'మహాబాహు-బ్రహ్మపుత్ర'ను​ ప్రారంభించనున్న మోదీ - నరేంద్ర మోదీ

ఈశాన్య భారత్​లోని ప్రాంతాల మధ్య రవాణా సౌకర్యాలను మెరుగుపరిచే లక్ష్యంతో చేపట్టిన 'మహాబాహు-బ్రహ్మపుత్ర' ప్రాజెక్టును ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. వీడియో కాన్ఫెరన్స్​ ద్వారా హాజరవనున్నారు. వాటితో పాటు ధుబ్రి-పుల్బారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.

PM MODI
ప్రధానమంత్రి నరేంద్ర మోదీ
author img

By

Published : Feb 18, 2021, 5:01 AM IST

అసోంలో 'మహాబాహు-బ్రహ్మపుత్ర' ప్రాజెక్టును గురువారం వీడియోకాన్ఫరెన్స్​ ద్వారా ప్రారంభించనున్నారు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ. దాంతో పాటు ధుబ్రి-ఫుల్బారి వంతెన నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే.. మజులి వంతెన నిర్మాణంలో భాగంగా నిర్వహిస్తోన్న ప్రత్యేక కార్యక్రమంలో పాల్గొననున్నారు.

నామటి-మజులి ద్వీపాలు, ఉత్తర గువాహటి-దక్షిణ గువాహటి, ధుబ్రి-హాట్సింగిమారి శిలాన్యాస్​ల మధ్య (రో-పాక్స్)​ ప్రయాణికుల రవాణా నౌక కార్యకలాపాలను ప్రారంభించటం ద్వారా ఈ మహాబాహు-బ్రహ్మపుత్ర ప్రారంభమవుతుందని ప్రధానమంత్రి కార్యాలయం తెలిపింది. వాటితో పాటు.. సులభతర వాణిజ్యంలో డిజిటల్​ సొల్యూషన్స్​ను కూడా ప్రారంభించనున్నట్లు వెల్లడించింది. ​నాలుగు ప్రాంతాల్లో రూ.9.41 కోట్లతో నీమటి, బిస్వనాథ్​ ఘాట్​, పండు, జోగిఘోపాలను పర్యటక ప్రాంతాలుగా అభివృద్ధి చేయనున్నారు.

మహాబాహు-బ్రహ్మపుత్ర అంటే?

ఈశాన్య భారత్​లోని ప్రాంతాలకు రవాణా సౌకర్యం కల్పించటం ఈ మహాబాహు-బ్రహ్మపుత్ర ప్రాధాన లక్ష్యం. అందులోనే బ్రహ్మపుత్ర, బరాక్​ నదీ పరివాహక ప్రాంతాల ప్రజల జీవన విధానాలు మెరుగుపరిచేందుకు పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టనున్నారు. రో-పాక్స్​ సేవల ద్వారా నదుల మధ్య అనుసంధాన సమయం తగ్గుతుంది. దీని వల్ల రోడ్డు ద్వారా వెళ్లే సమయమూ కలిసొస్తుంది. నీమటి-మజులి మధ్య సుమారు 420 కిలోమీటర్ల దూరం తగ్గుతుంది. ప్రస్తుతం ఈ వ్యవస్థ ద్వారా 12 కిలోమీటర్లు మాత్రమే ప్రయాణిస్తున్నారు. ఇది చిన్న తరహా పరిశ్రమల సరకు రవాణాకు చాలా ఉపయోగకరంగా ఉండనుంది.

ఇదీ చూడండి: బంపర్ ఆఫర్:​ థియేటర్​లో ఒక టికెట్​ కొంటే ఇంకోటి ఫ్రీ!

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.