అసోంను వరదలు(Assam flood) ముంచెత్తుతున్నాయి. వరదల ప్రభావం(Assam flood news) రాష్ట్రంలో దాదాపు 5.74 లక్షల మందిపై పడినట్లు అసోం విపత్తు నిర్వహణ శాఖ తెలిపింది. వరదల ధాటికి ఇప్పటివరకు ఒకరు మృతిచెందినట్లు పేర్కొంది. నల్బరీ జిల్లా తీవ్రంగా దెబ్బతిన్నది. 1.1లక్షల మందిపై ప్రభావం(Flood in Assam) చూపాయి.
ఇప్పటికే రంగంలోకి దిగిన రాష్ట్ర విపత్తుల నిర్వహణ సిబ్బంది.. జల దిగ్బంధంలో చిక్కుకుపోయిన గ్రామాల ప్రజలను సహాయ శిబిరాలకు తరలిస్తున్నారు. మరోవైపు జంతువులను కూడా రక్షించే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పటికే 1,018 మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు.
వరదలు.. 16 జిల్లాల్లోని 3.53లక్షల జంతువులపై ప్రభావం చూపాయి. కజిరంగా జాతీయ పార్కు, పులుల సంరక్షణ కేంద్రం ఇప్పటికే 70శాతం నీటిలో మునిగిపోయింది.
ఇదీ చదవండి: Assam Flood: పోటెత్తిన వరదలు- 950 గ్రామాలు జలదిగ్బంధం