ASSAM BOAT CAPSIZE: అసోంలోని బ్రహ్మపుత్ర నదిలో పడవ మనిగిపోయింది. 9 మంది ప్రయాణికులతో వెళ్తున్న పడవ దిబ్రూగఢ్‌లో జిల్లాలోని రొమోరియా ప్రాంతంలో ప్రమాదానికి గురైంది. ఐదుగురు వ్యక్తులు ప్రాణాలతో బయటపడ్డారు. నదిలో ఈదుకుంటూ ఒడ్డుకు చేరుకున్నారు. గల్లంతైన నలుగురి కోసం గాలింపు కొనసాగుతోంది.

ప్రమాదం గురించి సమాచారం అందుకున్న అధికారులు.. హుటాహుటిన సహాయక చర్యలు ప్రారంభించారు. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలను మోహరించారు. గల్లంతైన వారిని శంకర్ యాదవ్, శంకర్ కుర్మి, ధామెన్ దాస్, కిచన్ యాదవ్‌గా గుర్తించారు.

ఇదీ చదవండి: