కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే కాన్వాయ్‌లోని ఓ వాహనం ప్రమాదానికి గురైంది. ఎస్కార్ట్ వాహనాల్లోని కొరన్సరాయ్ పోలీసు స్టేషన్‌కు చెందిన ఓ కారు బోల్తా కొట్టింది. బిహార్‌లో ఆదివారం రాత్రి జరిగిన ఈ ఘటనలో పలువురు పోలీసులు గాయపడ్డారు. కేంద్ర మంత్రి బక్సర్ నుంచి పట్నాకు వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. భగవంతుడి దయ వల్ల ఎవరికీ తీవ్ర గాయాలు కాలేదని కేంద్ర మంత్రి అశ్వినీ చౌబే ట్విట్టర్లో తెలిపారు. ఈ మేరకు ఓ వీడియో పోస్ట్ చేశారు.
![Ashwini Choubey escorting vehicles overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-bux-minister-10030_15012023235133_1501f_1673806893_1048.jpg)
![Ashwini Choubey escorting vehicles overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-bux-minister-10030_15012023235133_1501f_1673806893_545.jpg)
మాథిలా- నారాయణ్‌పుర్ రహదారిపై ఉన్న దుమ్రావ్ వంతెనపై ప్రమాదం జరిగింది. ప్రమాదం అనంతరం కారును కేంద్ర మంత్రి పరిశీలిస్తున్నట్లు వీడియోలో కనిపిస్తోంది. క్షతగాత్రులను కేంద్ర మంత్రే స్వయంగా ఆస్పత్రికి తీసుకెళ్లినట్లు తెలుస్తోంది. ఘటనలో పోలీసుల బొలేరో వాహనం క్రాష్ అయిపోయింది. వెనక ఉన్న కారు డ్రైవర్లు అప్రమత్తంగా వ్యవహరించడం వల్ల పెను ప్రమాదం తప్పినట్లు తెలుస్తోంది. ఘటనలో గాయపడ్డ పోలీసులను దుమ్రావ్ సదర్ ఆస్పత్రికి తరలించినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. వాహన డ్రైవర్‌కు సైతం గాయాలయ్యాయని చెప్పారు. ఇద్దరు పోలీసులను మెరుగైన చికిత్స నిమిత్తం పట్నా ఎయిమ్స్‌కు తరలించారు.
![Ashwini Choubey escorting vehicles overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-bux-minister-10030_15012023235133_1501f_1673806893_772.jpg)
![Ashwini Choubey escorting vehicles overturned](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/bh-bux-minister-10030_15012023235133_1501f_1673806893_624.jpg)