నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తున్న రైతులు.. గాజీపుర్ సరిహద్దు వద్ద తాత్కాలిక నివాసాలను ఏర్పరచుకున్నారు. ఎండ తీవ్రతను తట్టుకునేందుకు వెదురు బొంగులతో గుడిసెలను నిర్మించారు. త్రివర్ణపతాకం ప్రతిబింబించేలా జాతీయ జెండా రంగులను గుడిసెలకు అద్దారు. పర్యావరణ రహితంగా గుడిసెలను నిర్మించినట్లు ఓ రైతు తెలిపారు. ధైర్యం, ఉత్సాహం కోసం నివాసాలపై త్రివర్ణ పతాక రంగులను వేశామన్నారు.
రైతులు.. తమ సంకల్పం ఎంత దృఢమైనదో తెలిపేందుకు గతంలోనూ సరిహద్దుల్లో ఇళ్లను నిర్మించుకున్నారు. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా దిల్లీ సరిహద్దులో నాలుగు నెలలకుపైగా ఉద్యమం కొనసాగిస్తున్నారు.
ఇదీ చదవండి : కరోనా వ్యాప్తి, వ్యాక్సినేషన్‌పై మోదీ సమీక్ష