ETV Bharat / bharat

'ప్రజల్లో విశ్వాసం ఉన్నంతవరకు విమర్శలు పట్టించుకోను' - Delhi Chief Minister Arvind Kejriwal

దేశ రాజధానిలో పలు చోట్ల జాతీయ జెండాల ఏర్పాటు సహా వృద్ధులను ఉచితంగా అయోధ్య తీసుకెళ్లడంపై విపక్షాల విమర్శలను ఖండించారు దిల్లీ సీఎం కేజ్రీవాల్​. ప్రజలకు తనపై విశ్వాసం ఉన్నంతవరకు విమర్శలను పట్టించుకోనని వ్యాఖ్యానించారు.

As long as I've people's support, I don't care if BJP, Cong curse me for tricolour move: Kejriwal
'ప్రజలకు విశ్వాసం ఉన్నంతవరకు విమర్శలు పట్టించుకోను'
author img

By

Published : Mar 15, 2021, 6:43 AM IST

75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని పురస్కరించుకుని దేశ రాజధానిలో పలు చోట్ల జాతీయ జెండాను ఏర్పాటు చేయడం, వృద్ధులను ఉచితంగా అయోధ్య యాత్రకు తీసుకెళ్లడంపై విపక్షాల నుంచి వస్తున్న విమర్శలను తిప్పికొట్టారు దిల్లీ సీఎం అరవింద్​ కేజ్రీవాల్​. కిరారీలో మురుగు నీటి ప్రాజెక్టును ప్రారంభించిన కేజ్రీవాల్​.. భాజపా, కాంగ్రెస్​ పార్టీలపై మండిపడ్డారు.

నగరంలో 500 చోట్ల జెండాలు ఏర్పాటు చేసి.. 75వ స్వాతంత్ర్య దినోత్సవాన్ని జరుపుకోవాలని తాము నిర్ణయించుకున్నట్లు తెలిపారు. అయోధ్య రామాలయం నిర్మాణం పూర్తయిన తర్వాత వృద్ధులను ఉచిత దర్శనానికి తీసుకెళ్లే ఏర్పాటు చేయనున్నట్లు స్పష్టం చేశారు. వీటిపై భాజపా, కాంగ్రెస్​లు విమర్శలు గుపిస్తున్నాయి. అయితే తనపై ప్రజలకు విశ్వాసం ఉన్నంతవరకు విపక్షాల విమర్శలను పట్టించుకోనన్నారు కేజ్రీవాల్​.

ఇదీ చూడండి: భాజపా గూటికి మరో డీఎంకే ఎమ్మెల్యే

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.