ETV Bharat / bharat

షిర్డీలో ఆంక్షల సడలింపు- మరో 10వేల మందికి సాయి దర్శనం - షిర్డీ సాయి దర్శనం

షిర్డీ సాయి బాబాను(shirdi temple news) దర్శించుకునేందుకు రోజుకు మరో 10వేల మందిని అనుమతించాలని నిర్ణయించింది ఆలయ ట్రస్టు, అహ్మద్​నగర్​ జిల్లా యంత్రాంగం. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో అదనంగా భక్తులను అనుమతిస్తున్నట్లు పేర్కొంది. ఈ నిర్ణయంతో రోజుకు 25వేల మంది సాయి దర్శనం(shirdi saibaba darshan) చేసుకునే వీలు కలుగనుంది.

Shirdi shrine
షిర్డీ సాయిబాబా
author img

By

Published : Nov 17, 2021, 12:48 PM IST

కొవిడ్​-19 కేసులు తగ్గుముఖం పట్టిన క్రమంలో మహారాష్ట్రలోని అహ్మద్​నగర్​ జిల్లా యంత్రాంగం కీలక నిర్ణయం తీసుకుంది. షిర్డీ సాయిని(shirdi temple news) దర్శించుకునేందుకు ఆఫ్​లైన్​ పాసుల ద్వారా రోజుకు మరో 10 వేల మందిని అనుమతిస్తున్నట్లు ప్రకటించింది. అంతకు ముందు అక్టోబర్​ 6న రోజుకు 15వేల మంది భక్తులకు బాబా దర్శనం(shirdi saibaba darshan) కల్పిస్తూ ఆదేశాలు జారీ చేసింది. తాజా నిర్ణయంతో మొత్తంగా రోజుకు 25వేల మంది ఆ సాయినాథుడిని దర్శించుకునే(shirdi temple open) అవకాశం లభించినట్లయింది.

"సాయిబాబా ఆలయ ట్రస్ట్​ ఇటీవల జరిగిన సమావేశంలో మరింత మందిని అనుమతించాలని నిర్ణయించింది. తాజా నిర్ణయం ప్రకారం కొవిడ్​-19 నిబంధనలు పాటిస్తూ.. ప్రతిరోజు ఆఫ్​లైన్​ పద్ధతిన అధనంగా మరో 10వేల మంది భక్తులను అనుమతించనున్నారు. మహారాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన కొవిడ్​-19 మార్గదర్శకాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకుంటామని ఆలయ ట్రస్ట్​ హామీ ఇచ్చింది. "

- రాజేంద్ర భోస్లే, అహ్మద్​నగర్​ జిల్లా కలెక్టర్​.

ఆధార్​ కార్డు చూపించిన వారికి ఉచిత ఆఫ్​లైన్​ పాసులు అందించేందుకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపింది శ్రీ సాయిబాబా సంస్థాన్​ ట్రస్ట్​.

కరోనా మహమ్మారికి ముందు షిర్డీ సాయి ఆలయాన్ని(shirdi temple news) రోజుకు లక్షల మంది దర్శించుకునేవారు. ప్రస్తుతం మహారాష్ట్రలో రోజుకు వెయ్యిలోపే కేసులు వస్తున్న క్రమంలో ఈ నిర్ణయం తీసుకున్నారు.

ఇదీ చూడండి: ఆరు నెలలు తర్వాత తెరుచుకున్న షిరిడీ సాయినాథుడి మందిరం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.