ETV Bharat / bharat

షారుక్​ కుమారుడి అరెస్ట్ ఫేక్.. అంతా భాజపా కుట్ర: మహా మంత్రి - Mumbai news today

ముంబయి డ్రగ్స్​ కేసుకు (cruise ship rave party) సంబంధించి సంచలన వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నేత నవాబ్​ మాలిక్​. అసలు డ్రగ్స్​ కేసు(Aryan Khan arrest news) ఓ బూటకమని, ఇది భాజపా కుట్రేనని ఆరోపించారు. ఆర్యన్​, అర్బాజ్​ను అరెస్టు(Aryan Khan arrest) చేసింది ఎన్​సీబీ కాదని, భాజపానేనని అన్నారు.

Aryan Khan's arrest is forgery, says minister Nawab Malik
ఆర్యన్​ అరెస్టుపై మహారాష్ట్ర మంత్రి కీలక వ్యాఖ్యలు
author img

By

Published : Oct 6, 2021, 5:46 PM IST

Updated : Oct 6, 2021, 9:20 PM IST

బాలీవుడ్​ బాద్​షా షారుక్​ ఖాన్​ తనయుడు ఆర్యన్​ ఖాన్​ అరెస్టుపై(Aryan Khan arrest news) కీలక వ్యాఖ్యలు చేశారు మహారాష్ట్ర మంత్రి, ఎన్​సీపీ నవాబ్​ మాలిక్​. ఆర్యన్​ను అక్రమంగా అరెస్టు (cruise ship rave party) చేశారని తెలిపారు. అసలు అరెస్టు చేసింది ఎన్​సీబీ(నార్కొటిక్స్​ కంట్రోల్​ బ్యూరో) అధికారులు కారని, భాజపా నాయకులని ఆరోపించారు. షారుక్​ను (Aryan Khan arrest) టార్గెట్​ చేసినట్లు నెలక్రితమే సమాచారం వచ్చిందని.. దీనిని బట్టి ఈ డ్రగ్స్​ కేసు ఓ బూటకమని నవాబ్​ పేర్కొన్నారు. ఎన్​సీబీ, భాజపా మధ్య సంబంధమేంటో చెప్పాలని డిమాండ్​ చేశారు.

''క్రూయిజ్​ పడవలో డ్రగ్​ పార్టీ అనేది బూటకం. అది నకిలీ అరెస్టు(Aryan Khan arrest news) . తదుపరి లక్ష్యం షారుక్​ ఖాన్ అని ​క్రైం రిపోర్టర్ల గ్రూపుల్లో నెల నుంచే సమాచారం చక్కర్లు కొట్టింది. ఆర్యన్​ అరెస్టు వెనుక భాజపా కార్యకర్తల హస్తం ఉంది.''

- నవాబ్​ మాలిక్​, మహారాష్ట్ర మంత్రి

ఆర్య‌న్ ఖాన్‌తో(Aryan Khan Arrest) సెల్ఫీ తీసుకున్న ఓ వ్యక్తి ఫొటో వైరల్​ కాగా.. అతడు తమ అధికారి కాదని ఎన్​సీబీ స్పష్టం చేసింది. అయితే.. వారి వివరాలను వెల్లడించారు నవాబ్​ మాలిక్​. ఫొటోలోని కేపీ గోస్వామి అనే వ్యక్తి పుణెలో మోసాలకు పాల్పడ్డాడని, అతడి ఫేస్​బుక్​లో రహస్య గూఢచారి అని ఉన్నట్లు వెల్లడించారు. అర్బాజ్​ మర్చెంట్​ను అరెస్టు(Aryan Khan arrest news) చేసిన మనీష్​ భానుషాలి భాజపా ఉపాధ్యక్షుడిగా ఫేస్​బుక్​లో ఉన్నట్లు తెలిపారు మాలిక్​. ఇంకా.. ఆయన ప్రధాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రి అమిత్​ షా తో దిగిన ఫొటోలు కూడా ఫేస్​బుక్​లో ఉన్నట్లు వెల్లడించారు.

Aryan Khan's arrest is forgery, says minister Nawab Malik
ఆర్యన్​తో కేపీ గోస్వామి సెల్ఫీ

మనీష్​ ఫేస్​బుక్​ ప్రొఫైల్​

గోస్వామి, మనీష్​ కలిసి ఉన్న ఫొటోలను కూడా నవాబ్ (Mumbai news today)​ విడుదల చేశారు. అయితే.. ప్రస్తుతం ఇరువురి ఫేస్​బుక్​ ఖాతాలు లాక్​లో ఉన్నట్లు తెలిపారు. అసలు ఎన్​సీబీకి, భాజపాకు ఏంటి సంబంధం అని ప్రశ్నించారు. దీనిపై స్పష్టత కావాలని డిమాండ్​ చేశారు.

'నాకు భద్రత కావాలి'

దీనిపై స్పందించిన మనీష్​.. తనకు భాజపాకు ఎలాంటి సంబంధం లేదన్నారు. తనపై నవాబ్​ మాలిక్​ అసత్య ఆరోపణలు చేస్తున్నారని.. ఈ అరెస్ట్​లతో భాజపాకు ఎలాంటి సంబంధం లేదని వెల్లడించారు.

"డ్రగ్స్​ పార్టీ జరగనుందని నాకు సమాచారం అందడం వల్లే నేను ఆ ప్రాంతానికి వెళ్లాను. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకే రైడ్​ జరిగిన సమయంలో ఎన్​సీబీ అధికారులతో ఉన్నాను. ఓ బాధ్యతగల పౌరుడిగా మాత్రమే నేను ఎన్​సీబీకి సమాచారం ఇచ్చాను. నవాబ్​ మాలిక్​పై పరువు నష్టం దావా వేస్తాను. ఆయన నా జీవితాన్ని ప్రమాదంలోకి నెట్టారు. నాకు భద్రత కల్పించమని అధికారులకు విజ్ఞప్తి చేస్తాను."

-మనీష్​ భానుషాలీ, భాజపా కార్యకర్త

డ్రగ్స్​ కేసులో గతనెల నవాబ్​ మాలిక్​ బంధువు ఒకరు పట్టుబడినట్లు తనకు తెలిసిందని మనీష్​ పేర్కొన్నారు.

మనీష్​ భానుషాలితో కేపీ గోస్వామి

నవాబ్​ మాలిక్​కు ఎన్​సీబీ​ కౌంటర్​..

మంత్రి నవాబ్​ మాలిక్​ చేసిన ఆరోపణలపై దీటుగా స్పందించింది ఎన్​సీబీ (NCB mumbai). తమపై చేసిన ఆరోపణలు నిరాధారమైనవని, చట్టపరంగా ఎన్​సీబీ తీసుకున్న చర్యలకు ప్రతీకారంగానే ఇలా చేస్తున్నారని బదులిచ్చారు ఎన్​సీబీ డిప్యూటీ డీజీ జ్ఞానేశ్వర్​ సింగ్​. చట్టపరంగా, పారదర్శకంగా, నిష్పాక్షికంగా ఎన్​సీబీ.. తన పని తాను చేసుకుపోతుందని స్పష్టం చేశారు. ఎన్​సీబీ ముంబయి బృందమే (NCB mumbai) నిందితులను పట్టుకుందని పునరుద్ఘాటించారు.

''క్రూయిజ్​ షిప్​పై దాడి చేసింది ముంబయి ఎన్​సీబీ బృందమే. 8 మందిని అక్కడే పట్టుకున్నాం. కొకైన్​, చారాస్​, ఎండీఎంఏ వంటి మాదకద్రవ్యాలు స్వాధీనం చేసుకున్నాం.''

- జ్ఞానేశ్వర్​ సింగ్

ఎన్​సీబీ బృందంలో భాజపాకు చెందిన కొందరు వ్యక్తులు ఉన్నారన్న విలేకరుల ప్రశ్నకు స్పందించిన జ్ఞానేశ్వర్​.. ''వారు(ఎన్​సీపీ నేతలు) కోర్టుకు వెళ్తే వెళ్లొచ్చు. న్యాయం కోరవచ్చు. మేం అక్కడే సమాధానమిస్తాం. మేం అంతా చట్టప్రకారమే చేశాం.'' అన్నారు.

ఇదీ జరిగింది..

అక్టోబర్​ 3న ముంబయి (Mumbai news today) నుంచి గోవా వెళ్తున్న ఓడలో ఏర్పాటుచేసిన రేవ్‌ పార్టీపై(cruise ship rave party) ఎన్​సీబీ అధికారులు జరిపిన దాడిలో బాలీవుడ్‌ సూపర్‌స్టార్‌ షారుక్‌ కుమారుడు ఆర్యన్‌ ఖాన్‌ (23) సహా మరో ఏడుగురు అప్పుడు అరెస్టయ్యారు. ఈ పార్టీలో(cruise ship rave party) కొంతమంది దుస్తుల్లో దాచుకొన్న ఎక్‌స్టసీ, కొకెయిన్‌, మఫెడ్రోన్‌ (ఎండీ), చరస్‌ వంటి మత్తు పదార్థాలను(Drugs Case News) అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు యువతులతోపాటు అదుపులోకి తీసుకున్న బృందంలో మూన్‌మూన్‌ ధామేచ, నుపుర్‌ సారిక, ఇస్మీత్‌ సింగ్‌, మోహక్‌ జస్వాల్‌, విక్రాంత్‌ ఛోకర్‌, గోమిత్‌ చోప్రా, ఆర్యన్‌ఖాన్‌, అర్బాజ్‌ మర్చంట్‌ ఉన్నారు. ఈ కేసులో ఇప్పటివరకు మొత్తం 16 మందిని అరెస్ట్ చేశారు.

ఇవీ చూడండి: డ్రగ్స్​ కేసులో ఆర్యన్​ఖాన్​ అరెస్ట్​- బాలీవుడ్​ లింకులపై ఎన్​సీబీ ఆరా!

క్రిప్టో కరెన్సీతో ఆర్యన్ ఖాన్ డ్రగ్స్​ కొనుగోలు!

Last Updated : Oct 6, 2021, 9:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.