ETV Bharat / bharat

తెలుగు రాష్ట్రాల మధ్య పరుగు తీయనున్న మరో 'వందేభారత్​'​.. ఈసారి ఆ మార్గంలో.. - Vande Bharat train fares

Tirupati to Secunderabad Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ భారం తగ్గించడానికి మరో వందే భారత్​ ఎక్స్​ప్రెస్​ పట్టాలపైకి రానుంది. ఇప్పటికే సికింద్రాబాద్​ నుంచి విశాఖపట్నం వరకు విజయవంతంగా పరుగులు తీస్తున్న వందేభారత్​ ఎక్స్​ప్రెస్​.. ఈసారి తిరుపతి నుంచి సికింద్రాబాద్​ వరకు పరగులు పెట్టడానికి సిద్ధమవుతోంది. దీనికి సంబంధించిన నిర్వహణ ఏర్పాట్లపై దక్షిణ మధ్య రైల్వే అధికారులకు ఆదేశాలు ఇచ్చిన రైల్వే శాఖ.. ఈ ట్రైన్​ను ఏప్రిల్​ 8న ప్రారంభించేందుకు ఏర్పాట్లు చేస్తోంది.

Vande Bharat Express
Vande Bharat Express
author img

By

Published : Mar 25, 2023, 12:57 PM IST

Tirupati to Secunderabad Vande Bharat Express: రెండు తెలుగు రాష్ట్రాల మధ్య మరో వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ రైలును త్వరలోనే పట్టాలు ఎక్కించడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది. సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య ఈ రైలు అందుబాటులోకి రానుందని రైల్వే వర్గాల ప్రాథమిక సమాచారం. నిర్వహణపరమైన ఏర్పాట్లతో అందుకు సిద్ధంగా ఉండాలని దక్షిణ మధ్య రైల్వే సంబంధిత రైల్వే డివిజన్ల అధికారులకు గురువారం రాత్రి సమాచారం అందించింది. వారంలో ఆరు రోజుల పాటు ఈ ట్రైన్​ నడపనున్నట్లు తెలుస్తోంది.

వయా నల్గొండ, గుంటూరు: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌ల మధ్య ప్రధాని నరేంద్ర మోదీ జనవరి 15న ప్రారంభించిన తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ సికింద్రాబాద్‌-విశాఖపట్నం మధ్య ప్రస్తుతం విజయవంతంగా నడుస్తోంది. ఇందులో ప్రయాణించడానికి ప్రయాణికులు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్‌ నుంచి తిరుపతికి నిత్యం వేల సంఖ్యలో శ్రీవారి భక్తులతో పాటుగా సాధారణ భక్తులు ప్రయాణిస్తుంటారు. మూడు నాలుగు వారాల ముందు ప్రయత్నిస్తే తప్ప రిజర్వేషన్‌ దొరకని పరిస్థితి.

ప్రయాణికుల నుంచి డిమాండ్‌ భారీగా ఉండటంతో రైల్వే శాఖ సికింద్రాబాద్‌-తిరుపతిల మధ్య వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ ప్రారంభించాలని నిర్ణయానికి వచ్చింది. ప్రస్తుతం సికింద్రాబాద్‌ నుంచి తిరుపతికి కాజీపేట-విజయవాడ, నల్గొండ-గుంటూరు, మహబూబ్‌నగర్‌-కర్నూలు, వికారాబాద్‌-తాండూరు-రాయచూరు.. ఇలా నాలుగు మార్గాల్లో రైళ్లు ప్రయాణిస్తున్నాయి. దీంతో సికింద్రాబాద్‌-తిరుపతి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను నల్గొండ-మిర్యాలగూడ-గుంటూరు మార్గంలో నడిపించాలని రైల్వేశాఖ నిర్ణయానికి వచ్చింది.

Secunderabad to Tirupati Vande Bharat Express: ఇకపోతే రైలు ఏయే స్టేషన్లలో ఆగుతుంది.. ఛార్జీలు, ప్రయాణ సమయంపై స్పష్టత రావాల్సి ఉంది. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను మాత్రం ఏప్రిల్‌ 8న ప్రారంభించే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తెలుగు రాష్ట్రాల మధ్య నడిచే తొలి వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను సికింద్రాబాద్‌లో ప్రారంభించిన నేపథ్యంలో రెండోదానిని తిరుపతిలో ప్రారంభించడానికి రైల్వే శాఖ ప్రయత్నిస్తోంది.

Secunderabad to Visakhapatnam Vande Bharat Express: ఇప్పటికే సికింద్రాబాద్​ నుంచి విశాఖపట్నం వరకు ప్రారంభించిన వందేభారత్​ ట్రైన్​ విజయవంతంగా ప్రయాణం సాగిస్తోంది. ప్రయాణికులకు అవసరమైన ఆధునిక వసతుల కల్పన, భోజన సదుపాయం అన్ని ఏర్పాట్లను ట్రైన్​లో అందుబాటులో ఉంచారు. రీడింగ్​ లైట్లు, అత్యవసర సమయంలో రైల్వే సిబ్బందితో మాట్లాడేందుకు అలారం బటన్స్​, 180 డిగ్రీల్లో తిరిగే సీట్లు ఏర్పాట్లు చేశారు. ఈ ట్రైన్​ రాకతో తెలుగు రాష్ట్రాల మధ్య ప్రయాణ భారం సుమారు 4 గంటలు తగ్గింది. విశాఖ నుంచి ప్రతిరోజు ఉదయం 5.45 గంటలకు ప్రారంభమయ్యే ఈ ట్రైన్​.. మధ్యాహ్నం రెండు గంటల 15 నిమిషాలకు సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌కు చేరుకుంటుంది. సికింద్రాబాద్ నుంచి మధ్యాహ్నం 3 గంటలకు ప్రారంభమై రాత్రి పదకొండున్నరకి విశాఖపట్నానికి చేరుకుంటుంది.

ఇవీ చదవండి:

8.40 గంటల్లో విశాఖకు.. వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్‌

చైనాకు షాక్- వందేభారత్ రైళ్ల టెండర్లు రద్దు

'రాహుల్‌పై వేటు.. ప్రజాస్వామ్యం గొంతు నొక్కడమే'​.. తప్పుబట్టిన ప్రతిపక్షాలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.