ETV Bharat / bharat

దాడి చేసిన ఉగ్రవాదుల కోసం ఆర్మీ వేట- రంగంలోకి NIA- పాక్ కుట్రలపై నిపుణుల హెచ్చరిక - ఆర్మీ సెర్చ్ ఆపరేషన్ పూంఛ్ న్యూస్

Army Vehcles Attacked Search Operation : జ‌మ్ముకశ్మీర్ రాజౌరి సెక్టార్‌లో దాడికి తెగబడిన తీవ్రవాదుల కోసం సైనిక బలగాలు పెద్ద ఎత్తున వేట సాగిస్తున్నాయి. అదనపు బలగాలను మోహరించాయి. హెలికాప్టర్లు, స్నిఫర్ డాగ్‌లతో ముష్కరుల కోసం జల్లెడపడుతున్నాయి. సైనిక ఉన్నతాధికారులు తీవ్రవాదులను మట్టుబెట్టే ఆపరేషన్‌ను స్వయంగా పర్యవేక్షిస్తుంటే, ఉగ్ర దాడి ఘటనపై NIA అధికారులు సైతం దృష్టి సారించారు.

Army Vehcles Attacked Search Operation
Army Vehcles Attacked Search Operation
author img

By PTI

Published : Dec 22, 2023, 7:26 PM IST

Army Vehcles Attacked Search Operation : సైనిక బలగాల వాహనాలపై దాడికి పాల్పడిన ముష్కరులను మట్టుబెట్టేందుకు జమ్ము కశ్మీర్ పూంచ్ జిల్లాలో సైనిక బలగాలు ముమ్మరంగా వేట సాగిస్తున్నాయి. భారీ ఎత్తున అదనపు బలగాలను మోహరించి ముష్కరుల కోసం వెతుకుతున్నాయి. స్నిఫర్ డాగ్​లను రంగంలోకి దించి తీవ్రవాదుల జాడ కనిపెట్టే ప్రయత్నం చేస్తున్నారు. హెలికాప్టర్లతో పైనుంచి అటవీ ప్రాంతంపై నిఘా పెట్టారు. మొత్తం ఆ ప్రాంతాన్ని దిగ్బంధించిన సైనిక బలగాలు ప్రతి వాహనాన్ని తనిఖీ చేస్తున్నాయి. అనుమానం ఉన్న ప్రతి ఒక్కరినీ ప్రశ్నిస్తున్నాయి. ధీర్ కి గలి రోడ్డులో ట్రాఫిక్‌ను నిలిపివేసిన సైన్యం ముష్కరుల కోసం వెతుకుతోంది. ఈ క్రమంలో కొందరు అనుమానితులను అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు.

  • #WATCH | Rajouri, J&K: Security forces are conducting a search operation in the forest area of Dera ki Gali in the Rajouri sector after the terrorist attack on Army vehicles yesterday. pic.twitter.com/Chs0Z5lBTm

    — ANI (@ANI) December 22, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

తీవ్రవాదులు దాడి చేసిన ప్రాంతానికి చేరుకున్న 16 కోర్‌ జనరల్ కమాండింగ్‌ ఆఫీసర్‌ లెఫ్టినెంట్‌ జనరల్‌ సందీప్‌ జైన్‌ ఆపరేషన్‌ జరుగుతున్న తీరును సమీక్షించారు. NIA అధికారులు సైతం తీవ్రవాద దాడి జరిగిన స్థలాన్ని పరిశీలించారు. గురువారం సాయంత్రం 3 గంటల 45 నిమిషాలకు పూంచ్‌ జిల్లాలోని రాజౌరి సెక్టార్‌లో ధీర్ కి గలి, బుఫ్లియాజ్ ప్రాంతాల మధ్య ఒక మలుపులో రెండు సైనిక వాహనాలపై ముష్కరులు ఆకస్మిక దాడికి తెగబడ్డారు. ఈ ఘటనలో ఐదుగురు సైనికులు అమరులయ్యారు. మరో ఇద్దరు గాయపడ్డారు. దాడిలో ఉగ్రవాదులు అమెరికాలో తయారైన రైఫిల్‌ను వాడినట్లు తెలుస్తోంది.

  • Visuals from Jammu and Kashmir's Poonch after terrorists ambushed two Army vehicles earlier today.

    (Note: Viewer discretion is advised.)
    (Note: Visuals deferred by unspecified time.) pic.twitter.com/k2ZnXHpP3t

    — Press Trust of India (@PTI_News) December 21, 2023 " class="align-text-top noRightClick twitterSection" data=" ">

ఉగ్రదాడి నేపథ్యంలో ముష్కరుల వేట కోసం సైన్యం అదనపు బలగాలు తరలించింది. ముగ్గురు, నలుగురు ముష్కరులు కొండపై నుంచి బ్లైండ్‌ స్పాట్‌గా భావిస్తున్న మలుపు వద్ద దాడికి తెగబడినట్లు అధికారులు భావిస్తున్నారు. చనిపోయిన సైనికుల మృతదేహాలను ఛిద్రం చేసిన ముష్కరులు వారి వద్ద ఉన్న కొన్ని ఆయుధాలను తీసుకుని పరారైనట్లు అధికారులు చెబుతున్నారు. కాగా, ఈ ఘటనను వివిధ రాజకీయ పార్టీలు ఖండించాయి.

పాకిస్థాన్ కుట్రలపై నిపుణుల హెచ్చరిక
ఉగ్రదాడి నేపథ్యంలో నిఘా నెట్​వర్క్​ను మరింత బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందని సైనిక నిపుణులు చెబుతున్నారు. నియంత్రణ రేఖ వెంబడి భద్రతా నిర్వహణను పటిష్ఠం చేయాలని అంటున్నారు. ఘటన జరిగిన ప్రదేశం భౌగోళికంగా కఠినంగా ఉంటుందని, అయినప్పటికీ అన్నింటికీ ఆర్మీ సిద్ధంగా ఉండాల్సిందని విశ్రాంత లెఫ్టినెంట్ జనరల్ పరమ్​జిత్ సింగ్ పేర్కొన్నారు. ఇలాంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయని, వీటిని ఆసరాగా చేసుకొని పాకిస్థాన్ ఉగ్రవాదాన్ని ఎగదోసేందుకు ప్రయత్నిస్తోందని హెచ్చరించారు.

సరిహద్దులో 300 మంది ఉగ్రవాదులు- భారత్​లోకి చొరబాటుకు రెడీ- బీఎస్​ఎఫ్ అలర్ట్

కానిస్టేబుల్​కు నిప్పంటించి హత్య చేసిన ప్రేయసి- వాంగ్మూలం మార్చి మరీ చనిపోయిన పోలీస్!

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.