Indian Army jobs 2023 : సాయుధ దళాల్లో పని చేయాలని ఆశించే అభ్యర్థులకు గుడ్ న్యూస్. అసోం రైఫిల్స్ స్పోర్ట్స్ కోటా కింద 81 రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల భర్తీ కోసం నోటిఫికేషన్ విడుదల చేసింది. ఆసక్తి గల అభ్యర్థులు జులై 30లోగా ఆన్లైన్లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
రిక్రూట్మెంట్ ర్యాలీ
Assam Rifles Recruitment Rally : అభ్యర్థులకు నాగాలాండ్‌లో సుఖోవిలోని అసోం రైఫిల్స్ ట్రైనింగ్ సెంటర్ అండ్ స్కూల్లో రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. ఆగస్టు 7 నుంచి ఈ రిక్రూట్మెంట్ ర్యాలీలు జరిగే అవకాశం ఉంది.
పోస్టుల వివరాలు
ప్రధానంగా క్రీడాకారులు మాత్రమే ఈ రైఫిల్ మెన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా 81 రైఫిల్ మాన్, రైఫిల్ ఉమెన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు భర్తీ చేయనున్నారు.
విద్యార్హతలు
Assam rifles rifleman eligibility : అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుంచి లేదా విద్యా సంస్థ నుంచి 10వ తరగతి, 12వ తరగతిలో ఉత్తీర్ణత సాధించి ఉండాలి.
వయోపరిమితి
Assam rifles rifleman age limit :
- జనరల్, ఓబీసీ అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 28 ఏళ్ల మధ్యలో ఉండాలి.
- ఎస్సీ, ఎస్టీ అభ్యర్థుల వయస్సు 2023 ఆగస్టు 1 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్యలో ఉండాలి.
క్రీడాంశాలు
Assam rifles rifleman sports quota : ఫుట్‌బాల్, అథ్లెటిక్స్, రోయింగ్, పెన్కాక్ సిలాట్, ఆర్చరీ, బాక్సింగ్, సెపక్తాక్రా, బ్యాడ్మింటన్, క్రాస్ కంట్రీ క్రీడాంశాల్లో మెరిట్ ఉన్న అభ్యర్థులు మాత్రమే ఈ పోస్టులకు అర్హులు.
స్పోర్ట్స్ అచీవ్మెంట్స్
Sports quota in Assam rifles : అభ్యర్థులు అంతర్జాతీయ, జాతీయ, రాష్ట్ర, రీజియన్ స్థాయిలో క్రీడా పోటీల్లో.. అవార్డ్స్ కానీ, నోటబుల్ పొజిషన్గానీ సంపాదించి ఉండాలి.
ఎవరెవరు అప్లై చేసుకోవచ్చు?
భారతీయ పౌరులైన క్రీడాకారులు ఈ రైఫిల్ మ్యాన్, రైఫిల్ ఉమెన్ పోస్టుల కోసం ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు.
అప్లికేషన్ ఫీజు
Assam rifles rifleman application fees : జనరల్, ఓబీసీ అభ్యర్థులు దరఖాస్తు రుసుముగా రూ.100 చెల్లించాల్సి ఉంటుంది. ఎస్సీ, ఎస్టీ, మహిళా అభ్యర్థులకు మాత్రం అప్లికేషన్ ఫీజు నుంచి మినహాయింపు ఇచ్చారు.
ఎంపిక విధానం
Assam rifles selection process : అభ్యర్థుల ఎంపిక వివిధ దశల్లో ఉంటుంది. ముందుగా రిక్రూట్మెంట్ ర్యాలీ నిర్వహిస్తారు. తరువాత క్రీడా నైపుణ్యం, శారీరక దృఢత్వం (ఫిజికల్ ఫిట్నెస్) చూస్తారు. వీటిలో ఉత్తీర్ణత సాధించిన వారికి మెడికల్ టెస్ట్ చేస్తారు. దీనిలోనూ క్వాలిఫై అయిన వారి డాక్యుమెంట్స్ వెరిఫై చేసి, ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
జీతభత్యాలు
Assam rifles rifleman salary : ఎంపికైన అభ్యర్థులకు సీపీసీ-7 ప్రకారం నెలవారీగా రూ.21,700 నుంచి రూ.69,100 వరకు జీతం ఇస్తారు. అలాగే ఇతర అలవెన్సులు కూడా లభిస్తాయి. వీటితో పాటు వైద్య, వసతి సౌకర్యాలు సహా ఇతర బెనిఫిట్స్ కల్పిస్తారు.