ETV Bharat / bharat

'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు - భారత సైన్యం

Army exam for recruiting personnel for general duty cancelled pan-India after paper found leaked: Officials.
'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు
author img

By

Published : Feb 28, 2021, 3:31 PM IST

Updated : Feb 28, 2021, 5:05 PM IST

15:26 February 28

'ఆర్మీ' పేపర్​ లీక్​- దేశవ్యాప్తంగా పరీక్ష రద్దు

దేశవ్యాప్తంగా సాధారణ సిబ్బందిని నియమించేందుకు నిర్వహించే ఆర్మీ ప్రవేశ పరీక్ష రద్దయింది. ప్రశ్నాపత్రం లీకైనందున ఈ నిర్ణయం తీసుకున్నట్లు అధికారులు తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇప్పటికే ముగ్గురిని  పోలీసులు అరెస్ట్​ చేశారన్నారు. పుణెలో స్థానిక పోలీసులతో కలిసి నిర్వహించిన సంయుక్త ఆపరేషన్‌లో గతరాత్రి సైనిక నియామక పరీక్ష ప్రశ్నపత్రం లీకైనట్లు తేలిందని సైనికాధికారులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి స్థాయి దర్యాప్తు నిర్వహిస్తున్నామని తెలిపారు.

పారదర్శక చర్యల్లో భాగంగానే పరీక్షను రద్దు చేసినట్లు వెల్లడించారు. ఆర్మీ రిక్రూట్​మెంట్ ​విధానంలో అవినీతి చర్యలను భారత ఆర్మీ సహించదని స్పష్టం చేశారు.  

Last Updated : Feb 28, 2021, 5:05 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.