ETV Bharat / bharat

ఫ్రీగా ఇస్తానన్న రైతు- మార్కెట్ ధరకు కొన్న సైన్యం - పుచ్చకాయ పంట మార్కెట్ ధరకు కొన్న సైన్యం

కరోనా కట్టడికి విధించిన లాక్​డౌన్ వల్ల ఓ రైతు తన పంటను విక్రయించలేక సతమతమయ్యాడు. దీంతో పండించిన పంటను మొత్తం సైన్యానికి ఉచితంగా అందించాలని నిర్ణయించుకున్నాడు. కానీ, సైన్యం మాత్రం రైతుకు అండగా నిలిచి.. ఆ ఉత్పత్తుల్ని మార్కెట్ ధరకే కొనుగోలు చేసి రైతుల మనసులు గెలుచుకుంది.

army-buys-jharkhand-farmers-watermelon-harvest-after-he-offers-it-for-free
ఫ్రీగా ఇస్తానన్న రైతు- మార్కెట్ ధరకు కొన్న సైన్యం
author img

By

Published : Jun 10, 2021, 7:57 PM IST

ఝార్ఖండ్​కు చెందిన ఓ రైతును సైన్యం ఆశ్చర్యంలో ముంచెత్తింది. పండించిన పంటను ఉచితంగా ఇచ్చేందుకు ముందుకొచ్చిన రైతుకు.. పూర్తి మార్కెట్ ధర చెల్లించి ఉత్పత్తుల్ని తీసుకెళ్లింది. అంతేకాకుండా కొందరు సైనికులు రైతు పొలానికి కుటుంబంతో కలిసి వెళ్లి.. కానుకలు అందించారు.

ఏం జరిగిందంటే?

కరోనా కట్టడికి ఝార్ఖండ్​లో విధించిన లాక్​డౌన్ వల్ల రంజన్ కుమార్ మాహ్తో అనే యువరైతు తన పుచ్చకాయ పంటను అమ్ముకునేందుకు ఇబ్బందులు ఎదుర్కొన్నాడు. దీంతో ఐదు టన్నుల పుచ్చకాయలను రామ్​గఢ్​లోని సిక్కిం రెజిమెంటల్ సెంటర్​(ఎస్ఆర్​సీ) సైనికులకు ఉచితంగా అందజేయాలని నిర్ణయించుకున్నాడు.

"లాక్​డౌన్​లో పంట కొనుగోలుకు ఎవరూ ముందుకు రాలేదు. పంట కుళ్లిపోయే స్థితికి చేరుకుంటోంది. గ్రామంలో కేజీ రెండు రూపాయలకు కూడా ఎవరూ కొనట్లేదు. వివిధ కేంద్రాల సహాయం కోరాం. అయినా స్పందన లేదు. చివరకు ఈ పంటనంతా సైనికులకు ఉచితంగా అందించాలని నిర్ణయించి కంటోన్మెంట్​ అధికారులను సంప్రదించాను."

-రంజన్ కుమార్ మాహ్తో, యువరైతు

రైతు ప్రకటనకు ముగ్ధులైన ఎస్ఆర్​సీ అధికారులు.. యువకుడి పొలాన్ని సందర్శించారు. పలువురు సైనికులు సైతం తమ కుటుంబ సభ్యులతో కలిసి వెళ్లి.. కానుకలు, వంట సామాగ్రిని అందించారు. పొలంలో పనిచేసే కూలీలకు ఆహార ప్యాకెట్లు ఇచ్చారు. అనంతరం ఐదు టన్నుల పుచ్చకాయలను తమ సొంత వాహనాల్లోనే ఎస్ఆర్​సీకి తీసుకెళ్లారు. వీటికి మార్కెట్ ధరను చెల్లించారు.

120 టన్నుల పంట పొలంలోనే

25 ఏళ్ల రంజన్ కుమార్ రాంచీ యూనివర్సిటీలో గ్రాడ్యూయేషన్ పూర్తి చేశాడు. అనంతరం వ్యవసాయ వృత్తిని ఎంచుకున్నాడు. ఏడాదికి ఒక్కో ఎకరానికి రూ.5 వేల చొప్పున 25 ఎకరాలను లీజుకు తీసుకున్నాడు. రూ.15 లక్షలతో ఆరు ఎకరాల్లో పుచ్చకాయ పంట పండించాడు. 120 టన్నుల పంట ఇంకా పొలంలోనే ఉంది. వీటిని కొనుగోలు చేసేందుకు ఇంకా ఎవరూ ముందుకు రావడం లేదని రంజన్ చెబుతున్నాడు.

ఇదీ చదవండి: Vaccine: ఆ రాష్ట్రాలు భేష్- వృథాలో ఝార్ఖండ్​ టాప్​

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.