AP Software Employee Family mystery deaths in Bangalore: ఆ ఇంటి నుంచి తీవ్ర దుర్వాసన వస్తుందని.. అపార్ట్మెంట్ వాళ్లు పోలీసులకు తెలిపారు. ఆ ఇంట్లోకి ప్రవేశించిన పోలీసులకు విస్తుపోయే దృశ్యాలు కనిపించాయి. మూడు మృత దేహాలు కిందపడి ఉన్నాయి. మరొకటి వేలాడుతూ కనిపించింది. బెంగళూరులో చోటు చేసుకున్న ఈ ఘటనలో మృతులు.. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన ఓ సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంగా గుర్తించారు. తన భార్య, పిల్లలను చంపి.. అనంతరం అతను కూడా ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు ప్రకటించారు.
భార్యను చంపి.. మృత దేహంతో మూడు రోజులు: స్టాక్ మార్కెట్లో నష్టాల కారణంగానే సాఫ్ట్వేర్ ఉద్యోగి కుటుంబంలోని నలుగురు మృతి చెందినట్లు బెంగళూరు కాడుగోడి పోలీసులు తెలిపారు. సాఫ్ట్వేర్ ఉద్యోగి.. తన భార్య, ఇద్దరు పిల్లలను చంపి.. భార్య మృత దేహంతో మూడు రోజుల పాటు ఇంట్లోనే ఉన్నట్లు వారు వెల్లడించారు. పిల్లలను చంపిన తరువాత అతను కూడా ఆత్మహత్యకు పాల్పడినట్లు ఫోరెన్సిక్ నివేదిక ఆధారంగా పోలీసులు చెప్పారు.
Constable Murder Case: ప్రియుడి కోసం భర్తను హతమార్చింది.. అనుమానం రాకుండా.. లక్షన్నర పెట్టి..
వివరాల్లోకి వెళ్తే.. కృష్ణా జిల్లా మచిలీపట్నంకు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగి వీరార్జున విజయ్(31).. తన భార్య హేమావతి(29), ఇద్దరు పిల్లలు మోక్ష, సృష్టి సునయనతో కలిసి బెంగళూరులోని సీగేహల్లిలోని సాయిగార్డెన్ అపార్ట్మెంట్లో నివాసం ఉంటున్నారు. వీరార్జున విజయ్‌కు హేమావతితో ఆరు సంవత్సరాలు క్రితం వివాహం జరిగింది.
స్టాక్ మార్కెట్లో నష్టాలు: సాఫ్ట్వేర్ ఉద్యోగి అయిన వీరార్జున విజయ్ బెంగళూరులోని కుందలహళ్లికి సమీపంలోని ఓ కంపెనీలో టీమ్ లీడర్‌గా పని చేస్తున్నారు. గత కొన్ని సంవత్సరాలుగా స్టాక్ మార్టెట్లో పెట్టుబడులు పెట్టడం కోసం అప్పులు కూడా చేశారు. కానీ స్టాక్ మార్కెట్లో భారీగా నష్టాలు చవిచూశారు. వీరార్జున విజయ్.. ఫోన్, ల్యాప్‌టాప్ పరిశీలించగా స్టాక్మార్కెట్లో నష్టాల కారణంగా అతను తీవ్రంగా బాధ పడుతున్నట్లు తెలిసిందని పోలీసులు చెప్పారు.
Mother: కన్నతల్లి కర్కశత్వం.. సభ్య సమాజం తలదించుకునేలా..!
దుర్వాసన రావడంతో పోలీసులకు సమాచారం: వీరార్జున ఫ్లాట్ నుంచి దుర్వాసన వస్తుండటంతో అనుమానించిన అపార్ట్మెంట్లోని వారు పోలీసులు సమాచారం ఇచ్చారు. దీంతో వీరార్జున ఇంటికి చేరుకున్న పోలీసులు డోర్ పగలకొట్టి.. లోపలికి వెళ్లి చూడగా నాలుగు మృత దేహాలు కనిపించాయి. హేమావతి, ఇద్దరు పిల్లల మృత దేహాలు నేలపై పడి ఉన్నాయి. వీరార్జున మృత దేహం వేలాడుతూ కనిపించింది. ఇందులో అప్పటికే హేమావతి మృతదేహం కుళ్లిన స్థితిలో ఉందని పోలీసులు వివరాలు వెల్లడించారు.
ఫోరెన్సిక్ నివేదికను వెల్లడించిన పోలీసులు.. మొదట హేమావతి, తరువాత ఇద్దరు పిల్లలు, చివరిగా వీరార్జున మృతి చెందినట్లు పేర్కొన్నారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. జులై 31వ తేదీన హేమావతిని వీరార్జున హత్య చేశారని, తరువాత ఆగస్టు 1వ తేదీన ఇద్దరు పిల్లలను చంపారు. భార్యను చంపిన తరువాత మూడు రోజుల పాటు మృత దేహంతో ఉన్న వీరార్జున.. ఆగస్టు 2వ తేదీన ఉరి వేసుకుని మృతి చెందారు. పోస్ట్‌మార్టం అనంతరం.. మృతదేహాలను కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు బెంగళూరులోని కాడుగోడి పోలీసులు తెలిపారు.
Government Teacher Murder: కారుతో ఢీకొట్టి.. వంద మీటర్లు ఈడ్చుకెళ్లి.. ఉపాధ్యాయుడి దారుణ హత్య