ETV Bharat / bharat

ఉపగ్రహాలను కూల్చే క్షిపణి నమూనా ఆవిష్కరణ

రక్షణ రంగానికి సంబంధించిన కీలకమైన యాంటీ-శాటిలైట్‌ మిసైల్‌ మోడల్‌ను రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఆవిష్కరించారు. ఈ క్షిపణిని అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను కూల్చే విధంగా అభివృద్ధి చేశారు. దిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌ సందర్శన సందర్భంగా ఆయన ఈ క్షిపణి నమూనాని ప్రారంభించారు.

anti satellite -missile-model inaugurated -at-drdo
ఉపగ్రహాలను కూల్చే క్షిపణి నమూనా ఆవిష్కరణ
author img

By

Published : Nov 10, 2020, 6:33 AM IST

అంతరిక్షంలోని శత్రు ఉపగ్రహాలను కూల్చే క్షిపణి నమూనా(యాంటీ-శాటిలైట్‌ మిసైల్‌ మోడల్‌)ని రక్షణశాఖ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌ సోమవారం ఆవిష్కరించారు. దిల్లీలోని డీఆర్‌డీవో భవన్‌ సందర్శన సందర్భంగా ఆయన ఈ క్షిపణి నమూనాని ప్రారంభించినట్లు రక్షణశాఖ ట్విట్టర్‌లో వెల్లడించింది.

గతేడాది మార్చి 27న అంతరిక్షంలో ఉన్న కృత్రిమ ఉపగ్రహాన్ని కూల్చి క్షిపణి ప్రయోగ పరీక్షను భారత్‌ విజయవంతంగా చేపట్టింది. దీంతో ఈ తరహా ప్రయోగం చేసిన నాలుగో దేశంగా అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్‌ చేరింది. గత రెండు నెలల్లో ఉపరితలం నుంచి ఉపరితలానికి ప్రయోగించే బ్రహ్మోస్‌, యాంటీ- రేడియేషన్‌ రుద్రం-1 వంటి తదితర క్షిపణులను భారత్‌ ఇప్పటికే విజయవంతంగా పరీక్షించింది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.