ETV Bharat / bharat

16 నెలల చిన్నారికి అరుదైన వ్యాధి.. పేరు చెప్పకుండా విదేశీయుడి రూ.11 కోట్ల సాయం - చిన్నారి చికిత్సకు 11 కోట్ల ఆర్థిక సాయం న్యూస్

అరుదైన వ్యాధితో బాధపడుతున్న 16 నెలల చిన్నారి చికిత్స కోసం ఓ వ్యక్తి భారీ మొత్తంలో ఆర్ధిక సహాయాన్ని అందించారు. తన పేరు చెప్పకుండా రూ.11 కోట్లను క్రౌడ్​ ఫండింగ్​లో జమ చేశారు.

assistance of 11 crore for child treatment
అరుదైన వ్యాధితో బాధపడుతున్న బాబు
author img

By

Published : Feb 22, 2023, 8:33 AM IST

విదేశాల్లో ఉంటున్న ఓ వ్యక్తి తన పేరు చెప్పకుండా.. కేరళకు చెందిన బాలుడి చికిత్స కోసం భారీ ఆర్థిక సహాయన్ని అందించారు. చిన్నారి చికిత్స నిమిత్తం రూ.11 కోట్లను క్రౌడ్​ ఫండింగ్​లో జమ చేశారు.

ఎర్నాకులానికి చెందిన నేవీ అధికారి సారంగ్, అతిధి దంపతుల కుమారుడు నిర్వాణ్(16 నెలలు)​ పుట్టిన 15 నెలల తర్వాత కూడా కాళ్లు కదపలేదు. దీంతో నెలరోజుల క్రితం బాబును ఆస్పత్రికి తీసుకుని వెళ్లి వైద్య పరీక్షలు చేయించారు. మెడికల్ రిపోర్స్​లో బాబుకు అరుదైన స్పైనల్ మస్క్యులర్ అట్రోఫీ(ఎస్​ఎమ్​ఎ) టైప్​ 2 అనే వ్యాధి ఉన్నట్లు తెలిసింది. అయితే బిడ్డకు రెండేళ్లు నిండక ముందే మెడిసిన్​ వేస్తేనే చికిత్స చేయటానికి వీలవుతుందని వైద్యులు తెలిపారు. ట్రీట్మెంట్​కు అవసరమైన మెడిసిన్​ను అమెరికా నుంచి తెప్పించి వైద్యం చేసేందుకు రూ.17.5 కోట్లు ఖర్చవుతుందని చెప్పారు. ప్రస్తుతం బాబుకు 16 నెలల వయస్సు. మరో ఎనిమిది నెలలోగా బాబుకు వైద్యం చేయించాలి.

అయితే అంత భారీ మొత్తంలో డబ్బులు భరించగలిగే స్తోమత ఆ చిన్నారి కుటుంబానికి లేదు. దీంతో సొసైటీ సభ్యులను ఆశ్రయించారు. దీంతో వైద్యం కోసం బాబు ఖాతాలోకి విరాళాలు రావడం మొదలయ్యాయి. ఈ క్రమంలోనే తన పేరు చెప్పకుండా విదేశాల నుంచి ఓ వ్యక్తి రూ.11 కోట్ల ఆర్థిక సాయాన్ని అందించాడు. క్రౌడ్ ఫండింగ్​ ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులకు కాస్త ఊరట లభించింది. మరో రూ.80 లక్షలు వస్తే నిర్వాణ్ చికిత్సకు సరిపడా డబ్బులు సమకూరినట్లే. దీంతో చికిత్సకు అవసరమైన మిగిలిన డబ్బుల కోసం ఆ బాలుడి కుటుంబం ఆశగా ఎదురుచూస్తోంది. నిర్వాణ్ కోలుకున్న తర్వాత తమకు రూ.11 కోట్ల అధిక మొత్తంలో ఆర్థిక సాయం అందించిన వ్యక్తిని కలుస్తామని బాబు కుటుంబ సభ్యులు తెలిపారు.

For All Latest Updates

TAGGED:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.