తనపై వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని మహారాష్ట్ర సీఎం ఉద్ధవ్ ఠాక్రేకు లేఖ రాసినట్లు హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ తెలిపారు. అవినీతి ఆరోపణల్లో నిజాలను వెలికితీయాలని కోరారు.
"పరమ్‌బీర్ సింగ్ నాపై చేసిన ఆరోపణలపై దర్యాప్తు చేయాలని సీఎంకు లేఖ రాశాను. నిజాలను నిగ్గుతేల్చాలని కోరాను. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి విచారిస్తే నేను స్వాగతిస్తాను. సత్యమేవ్ జయతే"
- అనిల్ దేశ్‌ముఖ్, మహారాష్ట్ర హోంమంత్రి
నెలకు రూ. 100 కోట్లు సంపాదించాలని పోలీసులకు మహారాష్ట్ర హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్ ఆదేశాలు జారీ చేశారంటూ ముంబయి మాజీ పోలీస్ కమిషనర్ పరమ్‌బీర్ సింగ్ రాసిన లేఖ తీవ్రదుమారం రేపుతోంది. అవినీతి, శాంతి భద్రతల్లో విఫలమైన ప్రభుత్వాన్ని రద్దుచేసి రాష్ట్రంలో రాష్ట్రపతి పాలన విధించాలని ప్రతిపక్ష భాజపా డిమాండ్ చేస్తోంది.
ఇదీ చూడండి: 'మహా'లో లేఖ రచ్చ- ఠాక్రే సర్కార్‌పై ఒత్తిడి!