ETV Bharat / bharat

అణ్వాయుధాగారానికి చైనా పదును- అదే దారిలో అమెరికా

అణ్వాయుధాగారాన్ని పెంచుకోవడం సహా శత్రువుపై సమర్థంగా ప్రతిదాడి చేయడమే లక్ష్యంగా చైనా అడుగులు వేస్తోంది. ఇందుకు నేలమాళిగల్లో రహస్యంగా కొత్త ప్రయోగ కేంద్రాలను నిర్మిస్తోంది. ఉపగ్రహ చిత్రాల ద్వారా ఈ విషయాన్ని అమెరికాకు చెందిన ఓ ఆయుధ నిపుణుడు విశ్లేషించారు. మరోవైపు చైనాను సాకుగా చెబుతూ అమెరికా కూడా భారీ అణ్వాయుధాగారాన్ని నిర్మించడానికి చర్యలు చేపట్టింది.

Analysis story on US-China Nuclear Weapons
అణ్వాయుధాలకు చైనా పదును.. ఆ దిశగానే అమెరికా అడుగులు!
author img

By

Published : Mar 2, 2021, 8:50 AM IST

చైనా తన అణ్వాయుధాగారానికి పదును పెడుతోంది. నేలమాళిగలో ప్రత్యేకంగా ప్రయోగ వేదికలను ఏర్పాటు చేస్తోంది. తద్వారా సరికొత్త అణ్వస్త్ర క్షిపణులను ప్రయోగించే సామర్థ్యాన్ని మరింతగా పెంచుకుంటోంది. ఇటీవల చైనాలోని ఒక క్షిపణి శిక్షణ కేంద్రంలో జరిగిన నిర్మాణాలకు సంబంధించి ఉపగ్రహ చిత్రాలు లభ్యమయ్యాయి. వీటిని పరిశీలించిన అమెరికా ఆయుధ నిపుణుడు హాన్స్ క్రిస్టెన్‌సన్‌ ఈ మేరకు పేర్కొన్నారు. అమెరికా నుంచి పెరుగుతున్న ముప్పును ఎదుర్కోవడానికి చైనా సన్నద్ధమవుతున్నట్లు కనిపిస్తోందన్నారు.

ఈ ఉపగ్రహ చిత్రాల ద్వారా జిలాంటాయ్‌లోని క్షిపణి పరీక్ష వేదిక వద్ద చైనా రహస్య కార్యకలాపాలను క్రిస్టెన్‌సన్‌ విశ్లేషించారు. అక్కడి నేలమాళిగలో గత ఏడాది 11 క్షిపణి ప్రయోగ వేదికల నిర్మాణాలను డ్రాగన్ మొదలు పెట్టిందని ఆయన తెలిపారు. ఇప్పటికే అక్కడ మరో ఐదు వేదికల నిర్మాణం జరుగుతోందని చెప్పారు. ప్రస్తుతం చైనా వద్ద 18 నుంచి 20 నేలమాళిగ ప్రయోగ కేంద్రాలు వినియోగంలో ఉన్నాయన్నారు. నేలమాళిగల్లో క్షిపణులను భద్రపరచడం ద్వారా అణ్వస్త్ర దాడిని తట్టుకొని.. ప్రతిదాడి చేసే రీతిలో తన ఆయుధాగారాన్ని తీర్చి దిద్దుకుంటున్నట్లు స్పష్టమవుతోందని క్రిస్టెన్‌సన్‌ పేర్కొన్నారు.

అయితే.. చైనా తన ప్రయోగ వేదికలను మూడింతలు చేసుకున్నా.. అది అమెరికా, రష్యా వద్ద ఉన్న సామర్థ్యాల ముందు దిగదుడుపేనని క్రిస్టెన్‌సన్‌ పేర్కొన్నారు. అమెరికా వద్ద ఇలాంటివి 450 వరకూ ఉన్నాయని తెలిపారు. చైనా కొత్తగా నిర్మిస్తున్న నేలమాళిగ కేంద్రాలన్నీ కొత్తతరం డీఎఫ్-1 అనే ఖండాంతర క్షిపణులను మోహరించడానికి వీలుగా తీర్చిదిద్దుతున్నట్లు చెప్పారు. రైలు, రోడ్డుపై తరలించడానికి వీలైన డీఎస్-41 రకాలనూ డ్రాగన్ ఇప్పటికే అభివృద్ధి చేసిందన్నారు.

చైనా సాకుతో అదే పనిలో అమెరికా

మరోవైపు చైనా అణ్వస్త్ర ఆధునికీకరణను కారణంగా చెబుతూ.. వచ్చే రెండు దశాబ్దాల్లో వందల కోట్ల డాలర్లు ఖర్చు పెట్టి, సరికొత్త అణ్వాయుధాగారాన్ని నిర్మించేందుకు అమెరికా కసరత్తు చేపట్టింది. వాస్తవానికి అమెరికా, చైనాలు సాయుధ ఘర్షణ దిశగా అడుగులు వేస్తున్నట్లు ఎక్కడా సూచనలు లేవు. అయితే వాణిజ్యం నుంచి జాతీయ భద్రత వరకు అనేక అంశాలపై అమెరికా చైనాల మధ్య ఉద్రిక్తతలు పెరుగుతున్న తరుణంలో వెలువడిన క్రిస్టెన్‌సన్‌ నివేదిక కలకలం సృష్టిస్తోంది.

ఇదీ చూడండి: ఆ చైనా మాజీ జనరల్‌కు కీలక పదవి

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.