రాజస్థాన్‌లోని బికానెర్(earthquake in rajasthan)లో భారీ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్(Richter scale)పై భూకంప తీవ్రత 5.3గా నమోదైంది.
ఉదయం 5.24 గంటలకు ఈ భూకంపం వచ్చినట్లు జాతీయ భూకంప అధ్యయన కేంద్రం(National Centre for Seismology) వెల్లడించింది. భూకంపం ధాటికి పరిసర ప్రాంతాలు కంపించాయి. భూప్రకంపనల ప్రభావం పలు కిలోమీటర్ల వరకు కనిపించింది.
లేహ్‌లోనూ
మరోవైపు, లద్దాఖ్‌లోని లేహ్(earthquake in Leh)లో సైతం భూకంపం వచ్చినట్లు భూకంప అధ్యయన కేంద్రం తెలిపింది. ఉదయం 4.57 గంటలకు 3.6 తీవ్రతతో భూకంపం నమోదైనట్లు వెల్లడించింది.
ఇదీ చదవండి: Bird flu in India: భారత్‌లో తొలి బర్డ్ ఫ్లూ మరణం