ఉత్తర్ప్రదేశ్ అలీగఢ్ ముస్లిం విశ్వవిద్యాలయంలోని జవహర్లాల్ మెడికల్ కళాశాల(జేఎన్ఎంసీ) అరుదైన ఘనత సాధించింది. ఏకంగా 300 మందికి విజయవంతంగా ఓపెన్ హార్ట్ సర్జరీ నిర్వహించి రికార్డు నెలకొల్పింది. ఈ సందర్భంగా వైద్యులు తమ సంతోషాన్ని 'ఈటీవీ భారత్'తో పంచుకున్నారు.
" మేము 2016లో ఓపెన్ హార్ట్ సర్జరీలు చేయటం ప్రారంభించాం. ఇటీవల జరిపిన ఓపెన్ హార్ట్ సర్జరీతో 300 మార్కును అందుకున్నాం. కేవలం అలీగఢ్ నుంచి మాత్రమే కాక యూపీలోని చాలా ప్రాంతాల నుంచి వైద్యం కోసం ఇక్కడకు వస్తున్నారు. ఇక్కడ తక్కువ ధరకే సర్జరీ చేస్తున్నాము."
--డాక్టర్. అజాం హసీన్, హృద్రోగ విభాగాధిపతి(జేఎన్ఎంసీ)
అంతేకాక 18 ఏళ్లలోపు వారికి జేఎన్ఎంసీలో ఓపెన్ హార్ట్ సర్జరీ ఉచితంగా చేస్తున్నామని డాక్టర్ అజాం హసీన్ తెలిపారు.
ఇదీ చదవండి : టీకా రెండు డోసులు తీసుకున్నా కరోనా పాజిటివ్!