ETV Bharat / bharat

ఇద్దరు మైనర్ల మధ్య ప్రేమ.. పారిపోయి 6నెలల క్రితం పెళ్లి.. చివరకు.. - The police arrested the loving couple in Jamui

ఇద్దరు మైనర్లు ప్రేమించుకున్నారు. ఆరు నెలల క్రితం పక్క రాష్ట్రానికి పారిపోయి పెళ్లి చేసుకున్నారు. అప్పటి నుంచి ఎవరికీ దొరకకుండా తిరిగారు. కొన్నినెలలపాటు గాలింపు చర్యలు చేపట్టిన పోలీసులు.. చివరకు వారిని అదుపులోకి తీసుకున్నారు. అసలేం జరిగిందంటే?

Amritsar lover couple arrested from Jamui
పెళ్లి చేసుకున్న మైనర్ ప్రేమ జంట
author img

By

Published : Dec 31, 2022, 2:46 PM IST

Updated : Dec 31, 2022, 3:11 PM IST

పాఠశాలలో చదువుతున్న సమయంలోనే వారిద్దరి మధ్య ప్రేమ చిగురించింది. దీంతో పెళ్లి చేసుకునే వయస్సు లేకపోయినా పక్క రాష్ట్రానికి పారిపోయి మరీ ఒక్కటైంది ఆ జంట. ఎవరికీ దొరకకుండా ఆరు నెలలు అలాగే ఉన్నారు ఇద్దరు. పోలీసులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి వారిని వెతికి పట్టుకున్నారు.
పంజాబ్​లోని అమృత్​సర్​కు చెందిన ఇద్దరు మైనర్లు ఒకే పాఠశాలలో కలిసి చదువుకున్నారు. ఆ సమయంలోనే వారిద్దరూ ప్రేమలో పడ్డారు. పెళ్లి చేసుకోవాలని ఇద్దరూ పంజాబ్ నుంచి పారిపోయి బిహార్​లోని జముయీకి వెళ్లారు. బాలిక బంధువులు ఆరు నెలల క్రితం అమృత్‌సర్‌లో కేసు నమోదు చేశారు. తాజాగా పంజాబ్​ పోలీసులు.. జముయీ పోలీసుల సహాయంతో వారిని పట్టుకున్నారు.

"జముయి పోలీస్​స్టేషన్​ పరిధిలోని ఒక ఇంట్లో ఇద్దరు మైనర్లు నివసిస్తున్నారు. వారిని అదుపులోకి తీసుకుని విచారించగా.. వారిద్దరు పెళ్లి చేసుకున్నట్లు ఒప్పుకున్నారు. కానీ వారిద్దరు మైనర్లు కావడం వల్ల అదుపులోకి తీసుకున్నాం. అరెస్ట్ చేసి పంజాబ్​కు తరలించాం."
-లఖాన్ సింగ్, పోలీసు అధికారి

Last Updated : Dec 31, 2022, 3:11 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.