ETV Bharat / bharat

'నినాదం అమిత్​ షాది- విజయం కాంగ్రెస్​ది!'

అసోంలో కాంగ్రెస్ వంద సీట్లకు పైగా గెలుస్తుందని ఆ పార్టీ అగ్రనేత, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్ పేర్కొన్నారు. అమిత్ షా చెప్పిన వంద సీట్లు తమకే వస్తాయని అన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను భాజపా సర్కార్ విస్మరించిందని ధ్వజమెత్తారు. ప్రజల్లో విభేదాలు సృష్టించడంపైనే దృష్టిసారించే భాజపా... అభివృద్ధి గురించి ఎందుకు మాట్లాడటం లేదని ప్రశ్నించారు.

Amit Shah's 100 plus target in Assam is meant for us: Baghel
'అసోంలో 124 సీట్లతో అధికారంలోకి వస్తాం'
author img

By

Published : Feb 24, 2021, 5:49 PM IST

అసోంలో వంద సీట్లు గెలవడమే లక్ష్యమని భాజపా అగ్రనేత అమిత్ షా చేసిన వ్యాఖ్యలను ఎగతాళి చేశారు కాంగ్రెస్ నేత, ఛత్తీస్​గఢ్ సీఎం భూపేశ్ బఘేల్. అమిత్ షా తమకు(కాంగ్రెస్​కు) వచ్చే సీట్ల గురించే మాట్లాడుతున్నారని, ఛత్తీస్​గఢ్​లో 'మిషన్ 65 ప్లస్'(65 స్థానాలకు మించి భాజపా గెలుపొందాలని లక్ష్యం) విపక్షాలకే వాస్తవంగా మారిందని అన్నారు.

పీటీఐ వార్తా సంస్థకు ఇంటర్వ్యూ ఇచ్చిన బఘేల్.. నాలుగింట మూడొంతుల మెజారిటీతో కాంగ్రెస్ నేతృత్వంలోని మహాకూటమి అసోంలో 100కు పైగా స్థానాలను కైవసం చేసుకుంటుందని ధీమా వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోసం ఎదురుచూస్తున్నారని చెప్పారు.

"అమిత్ షా ఛత్తీస్​గఢ్​కు వెళ్లి 65 సీట్లు గెలుస్తామని చెప్పారు. ఆయన చెప్పిన 65 సీట్లు మనకే(కాంగ్రెస్​కు) వస్తాయని అప్పుడు నేను అన్నాను. ఫలితాలు వచ్చాయి. మేం 68 స్థానాలు గెలిచాం. ఇప్పుడవి 70 అయ్యాయి. అసోంలో వంద సీట్లు వస్తాయని మా తరపునే అమిత్ షా చెబుతున్నారు. అసోం ప్రజలు ప్రభుత్వ పనితీరుపై సంతృప్తిగా లేరు. ఇచ్చిన హామీలను ప్రభుత్వం నెరవేర్చలేదు. ప్రజలకు చూపించిన కలల్ని నిజం చేయలేదు. మోసపోయామని ప్రజలు భావిస్తున్నారు. ఇప్పుడు వారు పరివర్తన్(మార్పు) కోరుకుంటున్నారు. మూడింట రెండొంతుల మెజారిటీతో అసోంలో మహా కూటమి అధికారంలోకి రాబోతుంది."

-భూపేశ్ బఘేల్, ఛత్తీస్​గఢ్ సీఎం

పౌరసత్వ సవరణ చట్టం సహా అసోం ఒప్పందం క్లాజ్-6పై ప్రజలను రాష్ట్ర ఆర్థిక మంత్రి హిమంత బిశ్వ తప్పుదోవ పట్టిస్తున్నారని అన్నారు బఘేల్. అసోం ప్రజల ప్రయోజనాల ప్రకారం సీఏఏ నిబంధనలు రూపొందిస్తామన్న హిమంత వ్యాఖ్యలను తప్పుబట్టారు. దేశవ్యాప్త అమలు కోసం తయారుచేసే సీఏఏను ఒక్క రాష్ట్రం కోసం ఎలా మార్చుతారని ప్రశ్నించారు.

విభజించడమే వారి లక్ష్యం!

ఏఐయూడీఎఫ్​తో కలిసి కాంగ్రెస్ ముస్లింల పార్టీగా మారిపోయిందన్న ఆరోపణలను సీఎం ఖండించారు. కూటమిలో మరో ఆరు పార్టీలు ఉన్నాయని, వాటిపై భాజపా మాట్లాడటం లేదని మండిపడ్డారు. గత ఐదేళ్లలో అసోం ప్రజలకు ఏం చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో అన్ని ప్రాంతాల ప్రజలు ఎలాంటి విభేదాలు లేకుండా జీవిస్తున్నారని, భాజపా మాత్రం మతాలవారీగా విభజించేందుకే ప్రయత్నిస్తోందని ఆరోపించారు. తన పనితీరుపై కాకుండా మత ప్రాతిపాదికన ఓట్లు అడగడమే భాజపా తీరు అని ధ్వజమెత్తారు.

కాంగ్రెస్.. మైనారిటీ, బుజ్జగింపు రాజకీయాలు చేస్తోందన్న భాజపా విమర్శలను తప్పుబట్టారు బఘేల్. కాంగ్రెస్, భాజపా పాలనల్లో.. ఎంతమంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించారనే విషయాన్ని పరిశీలిస్తే.. ఎవరు బుజ్జగింపు రాజకీయాలు చేస్తున్నారో తెలిసిపోతుందని అన్నారు.

కేంద్ర హోంశాఖ గణాంకాల ప్రకారం 2014-17 మధ్య 1,822 మంది అక్రమ వలసదారులను దేశం నుంచి బయటకు పంపించగా.. యూపీఏ పాలన(2005-13) మధ్య 82,728 మందిని బహిష్కరించినట్లు అసోం కాంగ్రెస్ చీఫ్ రిపున్ బోరా తెలిపారు.

ఇదీ చదవండి: 'అల్లర్ల సృష్టిలో మోదీ నం.1- చివరకు ట్రంప్​ పరిస్థితే!'

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.