బంగాల్లో రెండు రోజుల పర్యటనలో భాగంగా కోల్‌కతాలోని దక్షిణేశ్వర్ కాళీ దేవాలయాన్ని శుక్రవారం దర్శించుకున్నారు హోంమంత్రి అమిత్‌షా. ఆధ్యాత్మికత, మతసామరస్యం బంగాల్కే గర్వకారణం అన్నారు. వాటిని రాష్ట్రంలో పునరుద్ధరించాలని బంగాల్ ప్రజలను కోరారు.
"చైతన్య మహాప్రభు, ఠాగూర్ , రామకృష్ణ పరమహంస, వివేకానంద లాంటి గొప్ప వ్యక్తులు నడయాడిన చోటు బంగాల్. కానీ బుజ్జగింపు రాజకీయాల కారణంగా బంగాల్ వైభవం దెబ్బతింటోంది. "
---అమిత్‌షా, హోంమంత్రి
పర్యటనలో భాగంగా సీఆర్పీఎఫ్ సీనియర్ అధికారులతో భేటీ అయ్యారు. బంకురా చతుర్థి గ్రామంలోని ఓ గిరిజన కుటంబంతో కలిసి భోజనం చేశారు. బంగాల్ సీనియర్ భాజపా నాయకులతో రానున్న ఎన్నికలపై చర్చించారు.
లాక్డౌన్ తర్వాత అమిత్‌షా బంగాల్‌కు రావటం ఇదే మొదటిసారి.