కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ.. ఒక 'పర్యటక రాజకీయ నేత' అని అభివర్ణించారు కేంద్ర హోంమంత్రి అమిత్ షా. అమేఠీలో 15 ఏళ్లు ఎంపీగా ఉండి, ఏమీ అభివృద్ధి చేయని ఆయన, కేరళ వయనాడ్‌లోనూ ఏమీ చేయరని విమర్శించారు. ఇక్కడ శనివారం ఓ ర్యాలీలో పాల్గొన్న షా.. అసెంబ్లీ ఎన్నికల వేళ కాంగ్రెస్‌పై విమర్శనాస్త్రాలు సంధించారు.
"వయనాడ్.. రాహుల్ బాబా నియోజకవర్గం. అమెఠీకి ఆయన 15 ఏళ్లు ఎంపీగా ఉన్నా.. దాని అభివృద్ధికి ఏ ఒక్క పనీ చేయలేదు. ఇప్పుడాయన వయనాడ్‌కు మారారు. రాహుల్ బాబా లాంటి పర్యటక రాజకీయ నాయకుడిని నేనెక్కడా చూడలేదు. ఈ ప్రాంతం అభివృద్ధికీ ఆయన ఏమీ చేయరు."
- అమిత్ షా, కేంద్ర హోంమంత్రి
శబరిమల ఆలయంలో నిరసనల పట్ల కాంగ్రెస్ మౌనం వహించడాన్ని అమిత్ షా తప్పుబట్టారు. అయ్యప్ప భక్తులపై లాఠీ ఛార్జ్ జరుగుతుంటే ఆ పార్టీ ఏమీ మాట్లాడలేదని ధ్వజమెత్తారు. ఆలయాలను భక్తులే నిర్వహించాలని, నాస్తికులు కాదని ఎద్దేవా చేశారు.
ఇదీ చూడండి: 'సీపీఎం ముక్త్ భారత్ అని మోదీ అనరేం?'