ETV Bharat / bharat

'రోడ్డుపై ఆ పని చేయడం బ్యాన్.. అవసరమైతే 144 సెక్షన్'

MHA covid guidelines: భారత్​లో ఒమిక్రాన్​ కేసులు పెరుగుతున్న వేళ.. మాస్కులు తప్పనిసరిగా ధరించాలని, భౌతిక దూరాన్ని కచ్చితంగా పాటించాలని కేంద్ర హోంశాఖ ఉత్తర్వులు జారీ చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయకూడదని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు చేపడతామని స్పష్టం చేసింది.

Omicron scare in India
'కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలి.. లేకపోతే!'
author img

By

Published : Dec 27, 2021, 1:52 PM IST

Updated : Dec 27, 2021, 2:20 PM IST

Omicron scare in India: దేశంలో రోజురోజుకు పెరిగిపోతున్న ఒమిక్రాన్​ కేసుల నేపథ్యంలో.. కేంద్ర హోంశాఖ కీలక ఉత్తర్వులు జారీ చేసింది. పండగ వేళ.. రద్దీని నియంత్రించేందుకు అవసరమైతే స్థానికంగా ఆంక్షలు విధించే అవకాశాన్ని పరిశీలించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు సూచించింది. ఈ మేరకు కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్​ భల్లా.. అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.

టెస్ట్​, ట్రాక్​, ట్రీట్​, వ్యాక్సినేషన్​, కొవిడ్​ నిబంధనలు పాటించాలన్న వ్యూహంలో నిర్లక్షంగా ఉండకూడదని లేఖలో సూచించింది హోంశాఖ. కరోనా నివారణ, నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అమల్లో ఉన్న మార్గదర్శకాలను తప్పకుండా పాటించాలని నిర్దేశించింది.

"దేశంలో యాక్టివ్​ కేసుల సంఖ్య చాలా తగ్గింది. కానీ కొత్త వేరియంట్​ ఒమిక్రాన్​ కలవరపెడుతోంది. డెల్టా కన్నా ఇది వేగంగా వ్యాపిస్తోందని పరిశోధనలు చెబుతున్నాయి. ఈ క్రమంలో మనం జాగ్రత్త పడాల్సిన అవసరం ఉంది. కొవిడ్​ నిబంధనలు కచ్చితంగా పాటించాలి."

-- కేంద్ర హోంశాఖ లేఖ.

MHA covid guidelines: మాస్క్‌ ధరించాలని, సామాజిక దూరం తప్పనిసరిగా పాటించాలని ఉత్తర్వుల్లో హోంశాఖ స్పష్టం చేసింది. బహిరంగ ప్రదేశాల్లో ఉమ్మివేయడాన్ని నిషేధించింది. జిల్లా కలెక్టర్‌లు.. సూచనలను, నియమాలను పాటించేలా అన్ని చర్యలు తీసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది కేంద్ర హోంశాఖ. సామాజిక దూరం పాటించేందుకు అవసరం అయితే.. 144 సెక్షన్​ను ప్రయోగించాలని సూచించింది. విపత్తు నిర్వహణ చట్టంలోని నిబంధనలు ఉల్లంఘించిన వారిపై వెంటనే చర్యలు తీసుకోవాలని తేల్చిచెప్పింది. కొత్త వేరియంట్​పై అపోహలు, తప్పుడు సమాచారాన్ని అరికట్టేందుకు.. అధికారులు ఎప్పటికప్పుడు మీడియా సమావేశాలు నిర్వహించాలని స్పష్టం చేసింది కేంద్రం.

ఇదీ చూడండి:- దిల్లీపై ఒమిక్రాన్​ పంజా.. ఒక్కరోజులో 63 కేసులు

Last Updated : Dec 27, 2021, 2:20 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.