ETV Bharat / bharat

నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం.. క్షుద్రపూజలే కారణం! - ఉత్తర్​ప్రదేశ్ లేటెస్ట్ న్యూస్

ఉత్తర్​ప్రదేశ్​ అమేఠీలో దారుణం జరిగింది. నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం చేశారు దుండగులు. దీనికి క్షుద్రపూజలే కారణమని బంధువులు ఆరోపిస్తున్నారు. అసోంలో జరిగిన మరో ఘటనలో బీజేపీ మహిళా నేత హత్యకు గరయ్యారు.

Four Year Boy Brutal Murder
Four Year Boy Brutal Murder
author img

By

Published : Jun 12, 2023, 2:38 PM IST

నాలుగేళ్ల చిన్నారి కళ్లు పీకేసి సజీవ దహనం చేసిన ఘటన ఉత్తర్​ప్రదేశ్ అమేఠీలో జరిగింది. సగం కాలిపోయిన శరీరం గ్రామంలోని డ్రైనేజీ వద్ద లభ్యమైంది. క్షుద్రపూజలు చేసి తమ కుమారుడిని బలి ఇచ్చారని చిన్నారి తల్లిదండ్రులు ఆరోపిస్తున్నారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

ఇదీ జరిగింది
జామే పోలీస్ స్టేషన్​ పరిధిలోని రేసి గ్రామంలో జితేంద్ర ప్రజాపతి నివసిస్తున్నాడు. అతడి కుమారుడు దీపు ఆదివారం రాత్రి కనిపించకుండా పోయాడు. ఆందోళనకు గురైన తల్లిదండ్రులు అతడి కోసం గాలించారు. ఈ క్రమంలోనే సోమవారం ఉదయం గ్రామంలోని ఓ డ్రైనేజీ వద్ద సగం కాలిపోయిన స్థితిలో దీపు మృతదేహం కనిపించింది. అతడి కళ్లు సైతం పీకేశారు. క్షుద్రపూజలు చేసి చిన్నారిని బలి ఇచ్చారని మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టమ్ పరీక్షల కోసం ఆస్పత్రికి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

బీజేపీ మహిళా నేత హత్య
అసోంలోని గోపాలపురాలో బీజేపీ మహిళా నేత జోనాలి నాథ్​ హత్యకు గురయ్యారు. ఆదివారం రాత్రి 17వ నంబర్​ జాతీయ రహదారిపై ఉన్న శల్పారా గ్రామంలో ఆమె మృతదేహం లభ్యమైంది. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఆమెపై అత్యాచారం చేసి అనంతరం హత్య చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అయితే, జోనాలి కుటుంబసభ్యులు మాత్రం ఇది రాజకీయ హత్యని ఆరోపిస్తున్నారు. జోనాలి నాథ్​ను చివరిసారిగా రిజ్వాల్ కరీమ్​ అనే వ్యక్తితో చూసినట్లు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిద్దరి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు ప్రాథమిక విచారణలో తెలిసింది.

మోదీ-యోగిపై చర్చ.. ఓ వ్యక్తి హత్య
ప్రధాని నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్​పై చర్చ ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. చర్చలో భాగంగా మాటమాటా పెరగడం వల్ల ఆగ్రహించిన ఓ డ్రైవర్​ పెళ్లి కొడుకు బాబాయ్​పై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో రాజేశ్​ధార్ దూబే అనే వ్యక్తి అక్కడిక్కడే మృతిచెందాడు. దీంతో ఆగ్రహానికి గురైన మృతుడి బంధువులు మిర్జాపుర్​-ప్రయాగ్​రాజ్​ రహదారిని దిగ్బంధించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. పోలీసు ఉన్నతాధికారులు వచ్చి హామీ ఇవ్వడం వల్ల ఆందోళనను విరమించారు.

Four Year Boy Brutal Murder
మృతుడు రాజేశ్​ధార్ దూబే

కోలాహి గ్రామానికి చెందిన రాజేశ్​ధార్​ దూబే (50).. తన సోదరుడు కుమారుడి వివాహానికి మిర్జాపుర్​ వెళ్లాడు. అనంతరం కారులో తిరిగి వస్తుండగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ఉత్తర్​ప్రదేశ్ ముఖ్యమంత్రి యోగి అదిత్యనాథ్​పై కారు డ్రైవర్​తో చర్చ మొదలైంది. ఇద్దరి మధ్య మాటామాట పెరగడం వల్ల డ్రైవర్.. ​రాజేశ్​ధార్​ను కారు నుంచి బయటకు దించాడు. రాజేశ్​ దూబే కారును వెళ్లనీయనంటూ అడ్డంగా నిలబడ్డాడు. ఈ క్రమంలోనే తీవ్ర ఆగ్రహానికి గురైన డ్రైవర్ రాజేశ్​ధార్​పై నుంచి కారును పోనిచ్చాడు. ఈ ప్రమాదంలో దూబే అక్కడే ప్రాణాలు కోల్పోయాడు.

Four Year Boy Brutal Murder
ఆందోళన చేపట్టిన మృతుడు బంధువులు
Four Year Boy Brutal Murder
ఆందోళన చేపట్టిన మృతుడు బంధువులు

ఇవీ చదవండి : Nursing Student Murder in Vikarabad : కన్ను పీకేసి, గొంతు కోసి.. నర్సింగ్​ విద్యార్థిని దారుణ హత్య

వివాహ వేడుకలో 'ఫుడ్​ పాయిజన్'​.. 250 మందికి అస్వస్థత.. కొందరి పరిస్థితి విషమం

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.