ETV Bharat / bharat

రాష్ట్ర పారిశ్రామికాభివృద్ధిలో 'అమర్​ రాజా' పాత్ర చాలా కీలకం - పూర్తి సహకారం అందిస్తాం: సీఎం రేవంత్‌ - Galla meet CM Revanth

Amara Raja Company Chairman Galla Jayadev meet CM Revanth Reddy : అమర్ రాజా కంపెనీకి పూర్తి సహకారం అందిస్తామని సీఎం రేవంత్‌ రెడ్డి స్పష్టం చేశారు. తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో ఈ సంస్థ పాత్ర చాలా కీలకం అని కొనియాడారు. సచివాలయంలో సీఎం రేవంత్‌ రెడ్డిని అమర్ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌ మర్యాదపూర్వకంగా కలిశారు.

Amara Raja Company
Galla meet CM Revanth
author img

By ETV Bharat Telugu Team

Published : Jan 3, 2024, 3:26 PM IST

Updated : Jan 3, 2024, 4:32 PM IST

Amara Raja Company Chairman Galla Jayadev meet CM Revanth Reddy : తెలంగాణ పారిశ్రామిక అభివృద్ధిలో అమర్ రాజా(Amara Raja Company)ది కీలక పాత్రని సీఎం రేవంత్ రెడ్డి కొనియాడారు. రాష్ట్ర ప్రభుత్వం అమర్ రాజా కంపెనీకి పూర్తి సహాయ సహకారాలు అందిస్తుందని తెలిపారు. శుద్ధ ఇంధనం ఉత్పత్తికి తెలంగాణ కట్టుబడి ఉందని, అలాగే బ్యాటరీల ఉత్పత్తిలో అధునాతన సాంకేతికతను ఉపయోగించే కంపెనీలకు ప్రోత్సాహం అందిస్తామని చెప్పారు. సచివాలయంలోని సీఎం రేవంత్ రెడ్డి ఛాంబర్‌లో అమర్‌ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌(Galla Jayadev) మర్యాదపూర్వకంగా సీఎం, ఐటీ మంత్రి శ్రీధర్‌ బాబును కలిశారు. ఈ పరిశ్రమల స్థాపనకు సంబంధించిన పురోగతిపై మాట్లాడుతూ, ప్రభుత్వం అందించే సహాయ సహకారాలపై చర్చించారు.

తెలంగాణలో వ్యాపారం విస్తరిస్తాం : గిగా కారిడార్‌ ప్రాజెక్టుకు ప్రభుత్వం అందిస్తున్న సహకారం ఎంతో అభినందనీయమని అమర్‌ రాజా సంస్థ ఛైర్మన్ గల్లా జయదేవ్‌ పేర్కొన్నారు. ఈ ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేయడానికి ప్రభుత్వం సహకరిస్తోందని చెప్పారు. తెలంగాణలో తమ వ్యాపారాలను మరింత విస్తరిస్తామన్నారు. విద్యుత్ బ్యాటరీల అభివృద్ధికి ప్రభుత్వం తోడ్పాటునిస్తోందని గల్లా జయదేవ్ తెలిపారు.

రాష్ట్రానికి సంబంధించిన కీలక అంశాలపై ప్రధాని మోదీతో చర్చించిన సీఎం రేవంత్​, భట్టి

Amara Raja Company : తెలంగాణ రాష్ట్రంలో అమర్‌రాజా కంపెనీ భారీ పెట్టుబడులు పెట్టేందుకు సిద్దమయింది. రాష్ట్రంలోని దివిటిపల్లిలో లిథియం అయాన్ బ్యాటరీల తయారీకి సంబంధించిన గిగా ప్రాజెక్టు నెలకొల్పుతోంది. పెరుగుతున్న ఎలక్ట్రిక్ మొబిలిటీ ఎనర్జీ స్టోరేజ్ మార్కెట్‌కు అనుగుణంగా అడ్వాన్స్‌డ్‌ ఎనర్జీ స్టోరేజ్ టెక్నాలజీని ప్రవేశపెట్టేందుకు మహబూబ్ నగర్ జిల్లా దివిటిపల్లిలో అమర రాజా ఒక గిగా కారిడార్‌ను ఏర్పాటు చేస్తోంది.

దేశంలోనే పెద్దదైన అడ్వాన్స్‌డ్‌ కెమిస్ట్రీ సెల్ (ఏసీసీ), లిథియం-అయాన్ బ్యాటరీ తయారీ ఫ్యాక్టరీని ఇక్కడ నెలకొల్పుతోంది. తెలంగాణ న్యూ ఎనర్జీ పార్క్, బ్యాటరీ ప్యాక్ అసెంబ్లింగ్ యూనిట్, శంషాబాద్‌లోని ఇ-పాజిటివ్ ఎనర్జీ ల్యాబ్స్ పేరుతో రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్‌ హబ్‌ను ఏర్పాటు చేయనుంది. మొత్తం రూ.9,500 కోట్ల పెట్టుబడులకు కంపెనీ ముందుకొచ్చింది. దీంతో దాదాపు 4,500 మందికి ఉద్యోగాలు లభిస్తాయి. దాదాపు అదే సంఖ్యలో పరోక్షంగా ఉపాధి లభిస్తుంది.

Ex Governor Ram Mohan Rao Meet CM Revanth Reddy : మరోవైపు తమిళనాడు మాజీ గవర్నర్ పీఎస్ రామ్మోహన్‌ రావు సీఎం రేవంత్‌ రెడ్డిని కలిశారు. అంబేడ్కర్ సచివాలయానికి వచ్చిన పీఎస్‌ రామ్మోహన్‌ రావు సీఎంను మర్యాద పూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు.

16వ ఆర్థిక సంఘంలో రాష్ట్రానికి కేటాయింపులు పెంచాలి : సీఎం రేవంత్​ రెడ్డి

మెట్రో, ఫార్మా సిటీని రద్దు చేయడం లేదు: సీఎం రేవంత్‌రెడ్డి

Last Updated : Jan 3, 2024, 4:32 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.