ETV Bharat / bharat

దేశం 'లాక్​డౌన్'- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు! - దేశంలో లాక్​డౌన్

సంపూర్ణ లాక్​డౌన్ విధించనప్పటికీ.. దాదాపు దేశమంతా ఆంక్షల బాటలోనే కొనసాగుతోంది. కరోనా కట్టడికి రాష్ట్ర ప్రభుత్వాలే లాక్​డౌన్​లు విధిస్తున్నాయి. దాదాపు అన్ని రాష్ట్రాల్లో కరోనా ఆంక్షలు అమలవుతున్నాయి.

virus curbs india
దేశం లాక్​డౌన్ మయం- అన్ని రాష్ట్రాల్లో ఆంక్షలు!
author img

By

Published : May 11, 2021, 5:12 PM IST

కరోనా మహమ్మారిని కట్టడి చేసేందుకు వివిధ రాష్ట్రాలు యథాశక్తి కఠిన చర్యలు చేపడుతున్నాయి. లాక్‌డౌన్‌లు, కర్ఫ్యూలతో పాటు అనేక ఆంక్షలు విధించాయి.

లాక్‌డౌన్‌లు ఎక్కడెక్కడ?

  • తెలంగాణలో బుధవారం నుంచి లాక్​డౌన్ అమలు కానుంది. 10 రోజుల పాటు ఆంక్షలు ఉండనున్నాయి. లాక్​డౌన్ సమయంలో ఉదయం 6 నుంచి 10 గంటల మధ్య అన్ని కార్యకలాపాలు యథావిధిగా కొనసాగుతాయి.
  • దిల్లీలో ఇప్పటికే అమలవుతున్న లాక్‌డౌన్‌ను ఈ నెల 17 వరకు పొడిగించారు. మెట్రో రైలు సేవలను రద్దు చేశారు.
  • తమిళనాడు, రాజస్థాన్‌, పుదుచ్చేరిలో సోమవారం నుంచి లాక్​డౌన్ అమలులోకి వచ్చింది. రెండు వారాల పాటు ఆంక్షలు కొనసాగనున్నాయి.
  • హరియాణాలో ఈనెల 17 వరకు లాక్​డౌన్ పొడిగించారు. ఇంతకుముందు 9 జిల్లాల్లో వారాంతపు కర్ఫ్యూ అమలు చేశారు.
  • కేరళలో 9 రోజులు (శనివారం నుంచి), మిజోరంలో 7 రోజుల (సోమవారం నుంచి) పూర్తిస్థాయి లాక్‌డౌన్‌ కొనసాగుతోంది.
  • బిహార్‌లో ఈ నెల 15 వరకు లాక్​డౌన్ కొనసాగనుంది.
  • ఒడిశాలో 14 రోజుల లాక్‌డౌన్‌ ఈనెల 19 వరకు అమల్లో ఉంటుంది.
  • నాగాలాండ్‌లో కఠిన నిబంధనలతో పాక్షికంగా ఈనెల 14 వరకు కర్ఫ్యూ అమలు చేస్తున్నారు. ఆ తర్వాత పూర్తి స్థాయి లాక్​డౌన్ అమల్లోకి రానుంది. వారం పాటు సంపూర్ణ లాక్​డౌన్ విధిస్తూ ప్రభుత్వం మంగళవారం నిర్ణయం తీసుకుంది.

వారాంతాల్లో..

  • చండీగఢ్‌లో వారాంతపు లాక్‌డౌన్‌లు కొనసాగుతున్నాయి. మే 11నుంచి మరో వారం రోజుల పాటు రాత్రి కర్ఫ్యూ, వారాంతపు లాక్​డౌన్​ను కొనసాగించనున్నట్లు రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించింది.
  • ఛత్తీస్‌గఢ్‌లోనూ వారాంతపు లాక్‌డౌన్‌ విధించారు. స్థానికంగా అమలు చేసే లాక్‌డౌన్‌లను ఈనెల 15 వరకు పొడిగించుకోవచ్చని జిల్లా కలెక్టర్లకు ప్రభుత్వం ఆదేశాలిచ్చింది.
  • పంజాబ్‌లో ఈనెల 15 వరకు వారాంతపు లాక్‌డౌన్‌, రాత్రి కర్ఫ్యూలతో పాటు కఠిన నిబంధనలు విధించారు.

లాక్‌డౌన్‌ తరహా..

  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం లాక్​డౌన్ తరహా కర్ఫ్యూను అమల్లోకి తెచ్చింది. ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 12 వరకు కార్యకలాపాలకు మినహాయింపు ఇచ్చింది. మే 5న ప్రారంభమైన ఈ ఆంక్షలు రెండు వారాల పాటు కొనసాగనున్నాయి.
  • మహారాష్ట్రలో ఏప్రిల్‌ 5న ప్రారంభించిన నిబంధనలను ఈనెల 15 వరకు పొడిగించారు. నాశిక్​లో మే 12 నుంచి 23 వరకు ఈ నిబంధనలు అమలు కానున్నాయి.
  • ఉత్తర్‌ప్రదేశ్‌లో లాక్‌డౌన్‌ తరహా కఠిన నిబంధనలతో కూడిన కరోనా కర్ఫ్యూను ఈనెల 17 వరకు పొడిగించారు.
  • ఝార్ఖండ్‌లో ఈనెల 13 వరకు పొడిగించారు.
  • కర్ణాటకలో ఈనెల 24 వరకు అమలు చేస్తున్నారు.
  • సిక్కింలో ఈనెల 16 వరకు ఆంక్షలు విధించారు.
  • జమ్మూ-కశ్మీర్‌ అధికార యంత్రాంగం ఈనెల 10 వరకు నిబంధనలను అమలు చేస్తోంది.
  • లద్దాఖ్​లోని లేహ్​లో కర్ఫ్యూను మే 17 వరకు పొడిగించారు.

కర్ఫ్యూలు..

  • గోవా ప్రభుత్వం ఈనెల 9 నుంచి 24 వరకు కర్ఫ్యూ అమలు చేస్తోంది.
  • మధ్యప్రదేశ్‌లో ఈనెల 15 వరకు జనతా కర్ఫ్యూ విధించారు. అత్యవసర సేవలకు మాత్రమే అనుమతిస్తున్నారు.
  • గుజరాత్‌లో రాత్రివేళ కర్ఫ్యూ అమల్లో ఉండగా పగటిపూట ఆంక్షలు 36 నగరాల్లో ఈనెల 12 వరకు అమలు చేస్తున్నారు.
  • అసోంలో కర్ఫ్యూ రాత్రి 8 నుంచి అమలు చేస్తుండగా ఇకపై సాయంత్రం 6 గంటల నుంచే విధిస్తున్నారు.
  • అరుణాచల్‌ప్రదేశ్‌ ప్రభుత్వం సాయంత్రం 6.30 నుంచి ఉదయం 5 వరకు రాత్రి ఈ నెల మొత్తం అమలు చేస్తోంది.
  • మణిపుర్‌లోని 7 జిల్లాల్లో ఈనెల 8 నుంచి 17 వరకు కర్ఫ్యూ.
  • ఉత్తరాఖండ్‌ ప్రభుత్వం రాత్రి కర్ఫ్యూ సహా పలు నిబంధనలను తిరిగి విధించింది.
  • హిమాచల్‌ప్రదేశ్‌ ఈనెల 7 నుంచి 16 వరకు లాక్‌డౌన్‌ లేదా కరోనా కర్ఫ్యూ పేరిట నిబంధనలు విధించింది.
  • బంగాల్​లో గత వారం నుంచి కఠిన ఆంక్షలు కొనసాగుతున్నాయి.

ఇదీ చదవండి: 'భారత్​ గట్టెక్కాలంటే.. టీకాలే దిక్కు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.