నిషేధం అనంతరం ఎగుమతి చేయని రెమిడెసివిర్ నిల్వలను దేశీయ మార్కెట్లో పంపిణీ చేయడానికి అనుమతించాలని కేంద్రాన్ని కోరారు మహారాష్ట్ర ఆరోగ్య మంత్రి రాజేశ్ తోపే. తద్వారా ఔషధానికి ఉన్న డిమాండ్, సరఫరా మధ్య అంతరాలు తగ్గుతాయని గురువారం వివరించారు.
కొవిడ్ కేసులు ఉద్ధృతంగా పెరుగుతున్న నేపథ్యంలో తీవ్రత అధికంగా ఉన్న రోగులకు ఇచ్చే రెమిడెసివిర్ ఎగుమతులపై భారత్ ఆదివారం నిషేధం విధించింది. ఈ నేపథ్యంలో దేశీయంగా వాటి వినియోగానికి అనుమతించాలని కోరారు తోపే.
ఆహార, ఔషధ నియంత్రణ లెక్కల ప్రకారం మహారాష్ట్రలో 40 వేల రెమిడెసివిర్ డ్రగ్లు ఇవ్వగా, మరో 10 వేల వరకు అవసరం ఉన్నాయి. కాగా, అవసరానికి మించి ఈ ఔషధాన్ని వాడరాదని వైద్యులను కోరారు తోపే. మితిమీరిన వినియోగం కారణంగా డెమిడెసివిర్ కొరత ఏర్పండిందన్నారు.
ఇదీ చూడండి: కరోనా కట్టడికి ఆ రాష్ట్రాల్లో కఠిన ఆంక్షలు