ETV Bharat / bharat

మహంత్​ నరేంద్ర గిరి అనుమానాస్పద మృతి- మోదీ విచారం - yogi adityanath on narendra giri death

అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్ర గిరి(mahant narendra giri death news) అనుమానాస్పద రీతిలో కన్నుమూశారు. సోమవారం ఆయన తన గదిలో ఉరికి వేలాడుతూ కనిపించారని పోలీసులు తెలిపారు. నరేంద్ర గిరి మృతిపై ప్రధాని మోదీ విచారం వ్యక్తం చేశారు.

mahant narendra giri
మహంత్ నరేంద్ర గిరి
author img

By

Published : Sep 20, 2021, 6:59 PM IST

Updated : Sep 20, 2021, 10:03 PM IST

అఖిల భారతీయ అఖాడా పరిషత్​ అధ్యక్షుడు మహంత్​ నరేంద్ర గిరి.. ఉత్తర్​ ప్రదేశ్​ ప్రయాగ్​రాజ్​లోని బంగాబరి మఠంలో అనుమానాస్పద స్థితిలో మృతి(Mahant Narendra Giri Death News) చెందారు. సమాచారం అందుకున్న వెంటనే ఘటనాస్థలికి పోలీసులు చేరుకున్నారు. ఫోరెన్సిక్ బృందం, ప్రత్యేక పోలీసు బృందం.. మహంత్​ మృతిపై(Mahant Narendra Giri Death News) దర్యాప్తు చేపట్టింది.

మహంత్​ తన గదిలో ఉరి వేసుకుని(Mahant Suicide News) మృతి చెందినట్లుగా కనిపించారని అహ్మదాబాద్ ఎస్పీ దినేశ్​ కుమార్ తెలిపారు. అయితే.. దీని గురించి ఇంకా ఎలాంటి విషయాలు వెల్లడించలేదు. మఠంలోపలికి ఎవరూ వెళ్లేందుకు అధికారులు అనుమతించటం లేదు.

సూసైడ్ నోట్​ రాసి..

మహంత్​ నివాసంలో పోలీసులు.. 6-7 పేజీలతో ఉన్న ఆత్మహత్య(Mahant Suicide News) లేఖను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఆయన శిష్యుడు ఆనంద్ గిరి పేరును ప్రస్తావించినట్లు పోలీసులు తెలిపారు.

"ఎంతో గౌరవంతో నేను జీవించాను. అవమానం జరిగాక నేనిక బతకలేను. నేను ఆత్మహత్యకు పాల్పడుతున్నాను" అని లేఖలో మహంత్​ నరేంద్ర గిరి పేర్కొన్నారని పోలీసులు వెల్లడించారు.

అది ఆత్మహత్య కాదు..

ఇతరులను ఎంతో ప్రోత్సహించే నరేంద్ర గిరి(Mahant Narendra Giri Death News) వంటి వ్యక్తి ఆత్మహత్య ఎలా చేసుకుంటారని మహంత్ శిష్యులు ప్రశ్నిస్తున్నారు. ఆయన మృతిపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని డిమాండ్ చేశారు.

పోలీసులు మహంత్​ ఆత్మహత్య లేఖ​ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. అందులో ఉన్నది నరేంద్ర గిరి చేతిరాతేనా? లేదా ఇంకెవరిదైనా అయ్యుంటుందా అన్న కోణంలో దర్యాప్తు చేస్తున్నట్లు తెలుస్తోంది. మంగళవారం నరేంద్ర గిరి భౌతిక కాయానికి పోస్టుమార్టం నిర్వహించనున్నారు.

'నిందితులను వదిలిపెట్టం'

మహంత్​ నరేంద్ర గిరి మృతికి కారకులైన వారిని ఎట్టి పరిస్థితుల్లోనూ వదలిపెట్టబోమని ఉత్తర్​ప్రదేశ్​ డిప్యూటీ సీఎం కేశవ్ ప్రసాద మౌర్య తెలిపారు. మహంత్​ నరేంద్ర గిరి మృతిపై దర్యాప్తు న్యాయబద్ధంగా సాగాలని యోగా గురు బాబా రామ్​ దేవ్​ అన్నారు.

దేశంలోని సాధువుల మఠాల్లో అఖిల భారతీయ అఖాడా పరిషత్ అతిపెద్దది. మహంత్​ నరేంద్ర గిరి నిరంజనా అఖాడాకు కూడా అధిపతిగా వ్యవహరిస్తున్నారు.

మోదీ విచారం..

మహంత్​ మృతిపై(Mahant Narendra Giri Death News) ప్రధాని నరేంద్ర మోదీ విచారం వ్యక్తం చేశారు. ఆయన మరణం తనను ఎంతో బాధించిందని ట్వీట్ చేశారు. దేశంలోని వివిధ అఖాడాలను ఐక్యం చేయడంలో నరేంద్ర గిరి కీలక పాత్ర పోషించారని పేర్కొన్నారు. ఆధ్యాత్మిక సంప్రదాయాలకు అంకితమైన ఆయన సేవలందించారని తెలిపారు.

యోగి, అఖిలేశ్​ దిగ్భ్రాంతి..

మహంత్​ మృతి ఆధ్యాత్మిక జగత్తుకు తీరని లోటు అని ఉత్తర్​ప్రదేశ్​ ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ ట్విట్టర్​ వేదికగా​ పేర్కొన్నారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలని రాముడిని ప్రార్థిస్తున్నట్లు చెప్పారు.

నరేంద్ర గిరి మృతిపై సమాజ్​వాదీ పార్టీ అధినేత అఖిలేశ్​ యాదవ్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఈ దుఃఖాన్ని భరించే శక్తిని ఆయన అభిమానులకు ఇవ్వాలని భగవంతుడ్ని వేడుకుంటున్నట్లు ట్వీట్​ చేశారు.

Last Updated : Sep 20, 2021, 10:03 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.