Airport Authority of India recruitment: ఎయిర్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఇండియాలో ఎయిర్ ట్రాఫిక్ కంట్రోల్ జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదలైంది. జూన్ 15 నుంచి దరఖాస్తుల ప్రక్రియ ప్రారంభమవుతుంది. ఆన్లైన్లో ఉద్యోగానికి అప్లై చేయాల్సి ఉంటుంది.
అర్హతలు...
- బీఎస్సీ ఫిజిక్స్, మ్యాథ్స్‌లో మూడేళ్ల కోర్సు చేసి ఉండాలి. ఇందులో 60 శాతానికి మించి మార్కులు వచ్చి ఉండాలి.
- లేదా ఇంజినీరింగ్‌లో ఫుల్ టైమ్ కోర్సు పూర్తి చేసిన వారు జాబ్‌కు అర్హులు. అయితే, ఏదైనా ఒక సెమిస్టర్లో మ్యాథ్స్, ఫిజిక్స్ సబ్జెక్టులు ఉండాలి.
- ఎలాంటి ముందస్తు అనుభవం ఉండాల్సిన అవసరం లేదు.
- 10+2 స్థాయి ఇంగ్లిష్‌లో రాయగలిగే, మాట్లాడగలికే నైపుణ్యం ఉండాలి.
వయసు
- పోస్టులకు దరఖాస్తు చేసుకునేందుకు అభ్యర్థులకు గరిష్ఠ వయసు 27 ఏళ్లు.
- అయితే, వివిధ రిజర్వేషన్ కేటగిరీలకు వయసు సడలింపు ఉంటుంది.
ఖాళీల వివరాలు...
- మొత్తం 400 ఖాళీలు ఉన్నాయి.
- అన్ రిజర్వుడ్ పోస్టులు 163
- ఈడబ్ల్యూఎస్- 40
- ఓబీసీ- 108
- ఎస్సీ 59
- ఎస్టీ 30
- పీడబ్ల్యూడీ 4
వేతనం
- ఏఏఐ నోటిఫికేషన్ ప్రకారం.. ఈ ఉద్యోగాలకు ఎంపికైతే రూ.40 వేల ప్రాథమిక వేతనం లభించనుంది. ఇది రూ.లక్షా 40 వేల వరకు పెరిగే అవకాశం ఉంది.
- వీటికి డీఏ, హెచ్ఆర్ఏ ఇతర భత్యాలు అదనం.
- మొత్తంగా జూనియర్ ఎగ్జిక్యూటివ్ పోస్టుకు ప్రారంభంలో.. వార్షిక సీటీసీ రూ.12 లక్షలుగా ఉండనుంది.
ఎంపిక ఇలా..
ఆన్లైన్ పరీక్ష నిర్వహించి పోస్టులకు అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. డాక్యుమెంట్ వెరిఫికేషన్ ఉంటుంది. ఆ తర్వాత వాయిస్ టెస్ట్, బ్యాక్‌గ్రౌండ్ వెరిఫికేషన్ ఉంటాయి.
అప్లై ఇలా..
- www.aai.aero వెబ్సైట్ ద్వారా అప్లికేషన్ సమర్పించాలి.
- మరిన్ని వివరాలకు పై వెబ్‌సైట్‌ను సందర్శించండి.
ఇదీ చదవండి: