ఎయిర్ ఇండియా మహిళా పైలట్లు సరికొత్త చరిత్ర సృష్టించనున్నారు. అమెరికాలోని శాన్ఫ్రాన్సిస్కో నుంచి బోయింగ్ 777లో ఉత్తర ధ్రువం మీదుగా భారత్కు చేరుకోనున్నారు.
కెప్టన్ జోయా అగర్వాల్ నేతృత్వంలో పూర్తిగా మహిళా పైలట్లతో కూడిన ఈ బృందం మొత్తం 16,000 కీలోమీటర్లు ప్రయాణించి జనవరి 9న బెంగుళూరు చేరుకుంటుంది.
"ఉత్తర ధ్రువాన్ని చూసే అవకాశం ఎంతోమంది వారి జీవితకాలంలో సాధ్యం కాదు. పౌర విమానయాన శాఖ నాకు ఈ అవకాశం కల్పించినందుకు సంతోషంగా ఉంది.
మా బృందంలో అనుభవజ్ఞులైన కెప్టెన్ తన్మయ్ పాపాగారి, ఆకాంక్ష సోనావానే, శివానీ మన్హాస్ ఉండటం నాకు గర్వంగా ఉంది."
-జోయా అగర్వాల్ , చీఫ్ పైలట్
ఉత్తర ధ్రువం మీదగా ప్రయాణం అత్యంత సంక్లిష్టమైంది. విమానయాన సంస్థలు ఆ మార్గంలో ప్రయాణించేందుకు అనుభవజ్ఞులైన పైలట్లకే అవకాశం ఇస్తాయి. ఎయిర్ ఇండియాకు చెందిన పైలట్లు గతంలో ఉత్తర ధ్రువం మీదగా వచ్చినప్పటికీ... పూర్తిగా మహిళలతో కూడిన బృందం ఆ పని చేయడం ఇదే తొలిసారి.
ఈ ప్రయాణంతో జోయా అగర్వాల్ మరో ఘనత సాధించిన వారు అవుతారు. ఇదివరకు 2013లో అతిచిన్న వయసులో బోయింగ్ 777 నడిపిన మహిళగా ఘనత పొందారు.
ఇదీ చూడండి : సీసీబీ విచారణకు మాజీ సీఎం భార్య