ETV Bharat / bharat

ఉత్కంఠకు తెర- దిల్లీ చేరుకున్న ఎయిరిండియా విమానం

కాబూల్​ నుంచి 129 మంది ప్రయాణికులతో ఎయిరిండియా విమానం దిల్లీకి చేరుకుంది. ఆదివారం మధ్యాహ్నం దిల్లీ నుంచి 40 మంది ప్రయాణికులతో కాబూల్​ చేరకున్న విమానం.. గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో తిరిగి భారత్​కు చేరుకుంది.

Air India flight
ఎయిరిండియా
author img

By

Published : Aug 16, 2021, 12:50 AM IST

Updated : Aug 16, 2021, 1:09 AM IST

అఫ్గానిస్థాన్​ రాజధాని కాబూల్​ను తాలిబన్లు హస్తగతం చేసుకోవడం వల్ల ఏర్పడిన గందరగోళ పరిస్థితుల నేపథ్యంలో అక్కడికి వెళ్లిన ఎయిరిండియా విమానం.. 129 ప్రయాణికులతో తిరిగి దిల్లీకి చేరుకుంది. దిల్లీ నుంచి 40 మంది ప్రయాణికులతో సురక్షితంగా కాబూల్​ వెళ్లిన విమానం.. తిరిగి ప్రయాణంలో టేకాఫ్​ సమయంలో ఇబ్బందులు ఎదుర్కొంది.

ఎయిరిండియా విమానంపై ఉత్కంఠ..

దిల్లీ నుంచి కాబూల్‌కు ఆదివారం మధ్యాహ్నం ఎయిరిండియా విమానం బయలుదేరిన సమయంలో అఫ్గానిస్థాన్‌లో పరిస్థితులు బాగానే ఉన్నాయి. విమానం టేకాఫ్‌ అయిన కొద్ది సమయానికే కాబూల్‌ను తాలిబాన్లు హస్తగతం చేసుకున్నారనే ప్రకటన వెలుబడింది. అదే సమయంలో కాబూల్‌ ఎయిర్‌పోర్టులో విమానానికి అనుమతిచ్చేందుకు ఏటీసీ సిబ్బంది అందుబాటులో లేకపోవడం వల్ల ఆందోళన నెలకొంది. దీంతో అప్రమత్తమైన ఎయిరిండియా పైలట్.. శత్రువులకు లక్ష్యంగా కాకుండా ఉండేందుకు విమాన రాడార్‌ వ్యవస్థను ఆఫ్‌ చేశారు. చివరకు గంట ఆలస్యంగా కాబూల్‌ ఎయిర్‌పోర్టులో విమానం దిగడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. మళ్లీ అదే విమానం 129 ప్రయాణికులతో దిల్లీకి చేరుకుంది.

విమానం దిగిన ఆనంతరం అక్కడి పరిస్థితిపై ఓ మహిళ ఆందోళన వ్యక్తం చేసింది. "అఫ్గానిస్థాన్​ను ప్రపంచ దేశాలు విడిచిపెట్టడాన్ని నమ్మలేకపోతున్నాను. నా మిత్రులు చనిపోతున్నారు. వారు(తాలిబాన్లు) మమ్మల్ని చంపేస్తున్నారు. మహిళలకు ఇకపై ఎలాంటి హక్కులు ఉండవు" అని వాపోయింది.

'నిశితంగా పరిశీలిస్తున్నాం'

మరోవైపు 'ప్రస్తుతం అఫ్గాన్‌లో వేగంగా చోటుచేసుకుంటున్న పరిస్థితులను ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్లు భారత ప్రభుత్వ వర్గాలు తెలిపాయి. భారత రాయబార కార్యాలయ సిబ్బందితో పాటు కాబూల్‌లోని భారత పౌరుల ప్రాణాలను పణంగా పెట్టమని పేర్కొన్నాయి. క్షేత్ర స్థాయిలో పరిస్థితులను బట్టి నిర్ణయం తీసుకుంటామని స్పష్టం చేశాయి. వారిని అవసరమైన సమయంలో స్వదేశానికి తరలించే ఏర్పాట్లతో ఇప్పటికే సిద్ధంగా ఉన్నామని తెలిపాయి. ఇందుకోసం భారత వాయుసేనకు చెందిన C-17 విమానాన్ని సిద్ధంగా ఉంచినట్లు సమాచారం.

ఇవీ చూడండి:

Last Updated : Aug 16, 2021, 1:09 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.