ETV Bharat / bharat

ప్రియుడి కోసం దుబాయ్​ నుంచి వచ్చిన ఎయిర్​హోస్టెస్​.. నాలుగో అంతస్తు నుంచి దూకి.. - బెంగళూరులో ఎయిర్​ హోస్టెస్​ ఆత్మహత్య ​వార్తలు

ప్రియుడిని కలిసేందుకు దుబాయ్ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ఎయిర్ హోస్టెస్ ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన కర్ణాటకలో జరిగింది. మరోవైపు మహారాష్ట్రలో నిర్మాణంలో ఉన్న భవనంపై నుంచి ఇనుప రాడ్​ పడి ఆటోలో ప్రయాణిస్తున్న తల్లీకూతురు మృతి చెందారు.

Air Hostess Died In Bangalore Crime News
బెంగళూరులో ఎయిర్​ హోస్టెస్​ ఆత్మహత్య క్రైమ్​ వార్తలు
author img

By

Published : Mar 12, 2023, 12:31 PM IST

కర్ణాటకలో ఘోరం జరిగింది. తన ప్రియుడిని కలిసేందుకు దుబాయ్​ నుంచి బెంగళూరుకు వచ్చిన ఓ ఎయిర్​ హోస్టెస్ అపార్ట్​మెంట్​ బిల్డింగ్​పై నుంచి దూకి ఆత్మహత్య చేసుకుంది.

6 నెలలుగా ప్రేమలో..
మంగళూరుకు చెందిన ఆదేశ్ వృత్తిరీత్యా బెంగళూరులో నివాసముంటున్నాడు. మృతురాలు అర్చన(28) స్వస్థలం హిమాచల్ ప్రదేశ్​. కాగా, ఇద్దరూ గత ఆరు నెలలుగా ప్రేమించుకుంటున్నారు. ఈ క్రమంలోనే ప్రియుడు ఆదేశ్​ను కలవడానికి అర్చన శుక్రవారం దుబాయ్​ నుంచి బెంగళూరుకు వచ్చింది. కోరమంగళ ప్రాంతంలోని రేణుకా రెసిడెన్సీ భవనం​లో ఇద్దరు శనివారం అర్ధరాత్రి గొడవ పడ్డారు. అనంతరం అర్చన భవనం నాలుగో అంతస్తు నుంచి దూకి బలవన్మరణానికి పాల్పడింది. అయితే యువతి ఓ ప్రముఖ ఎయిర్​లైన్స్​లో ఎయిర్​ హోస్టెస్​గా పనిచేస్తుండగా.. ఆదేశ్ బెంగళూరులో సాఫ్ట్​వేర్​ ఇంజినీర్​గా పని చేస్తున్నాడు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు.. అపార్ట్​మెంట్​ పరిసరాల్లోని సీసీటీవీ ఫుటేజీలను పరిశీలిస్తున్నారు. ప్రస్తుతం విచారణ కొనసాగుతోందని.. మృతదేహాన్ని సెయింట్​ జాన్స్​ ఆసుపత్రికి తరలించినట్లు సౌత్ ఈస్ట్ డివిజన్ డీసీపీ సీకే బాబు తెలిపారు.

భవనంపై నుంచి ఇనుప రాడ్డు పడి..
మహారాష్ట్రలో ఓ భవన యజమాని నిర్లక్ష్యం కారణంగా ఒకే కుటుంబానికి చెందిన ఇద్దరు మృతి చెందారు. నిర్మాణంలో ఉన్న బిల్డింగ్​పై నుంచి ఇనుప రాడ్ పడడం వల్ల ఆటోలో వెళ్తున్న తల్లీకూతురు మరణించారు.

Mumbai Iron Rod Incident Crime News
ఇనుప రాడ్డు పడిన ఆటో.. తల్లి, కుమార్తె మృతి

నెల కూడా కాకముందే..
శనివారం సాయంత్రం ముంబయిలోని సబ్​అర్బన్​ జోగేశ్వరి ప్రాంతంలో ఓ మహిళ, ఆమె కుమార్తె ఆటోలో ప్రయాణిస్తున్నారు. ఈ క్రమంలో అక్కడే నిర్మాణంలో ఉన్న 14 అంతస్తుల భవనంలోని 7వ అంతస్తుపై నుంచి ఇనుప రాడ్​ పడింది. అది కాస్త ఆటోలో వెళ్తున్న తల్లీకూతురి పడడం వల్ల తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరిగిన వెంటనే వాహనదారుడు అంబులెన్స్​కి సమాచారం ఇవ్వడం వల్ల మొదట వారిని సమీపంలోని ట్రామా కేర్​ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మహిళ చనిపోయిందని వైద్యులు చెప్పారు. అనంతరం కుమార్తెకు మెరుగైన చికిత్స కోసం అంథేరీలోని కోకిలాబెన్​ ఆసుపత్రికి పంపించారు. అక్కడికి వెళ్లే సరికి బాలిక కూడా మృతి చెందినట్లు డాక్టర్లు వెల్లడించారు. కాగా, చనిపోయిన మహిళ షామా బానో ఆసిఫ్ షేక్(28), అయత్ ఆసిఫ్ షేక్(9)గా గుర్తించారు అధికారులు.

గత నెల 14న కూడా ఈ తరహా ఘటనే సెంట్రల్​ ముంబయిలోని వర్లీ ప్రాంతంలో వెలుగుచూసింది. ఈ ఘటనలో నిర్మాణంలో ఉన్న భవనంలోని 52వ అంతస్తు నుంచి కింద నిలబడి ఉన్న ఇద్దరు వ్యక్తులపై సిమెంట్​ దిమ్మె పడటం వల్ల ఇద్దరు చనిపోయారు. కాగా, ఈ వరుస ఘటనలపై బాంబే హైకోర్టు తీవ్రంగా స్పందించింది.

నిప్పంటుకుని ఒకే కుటుంబంలో ఐదుగురు..
ఉత్తర్​ప్రదేశ్​లోని కాన్పూర్​ జిల్లాలో ఘోర అగ్నిప్రమాదం జరిగింది. గుడిసెకు నిప్పంటుకుని ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురు అగ్నికి ఆహుతయ్యారు. భార్యభర్తలు సహా ముగ్గురు మరణించగా.. మరో నవజాత శిశువు, ఓ వృద్ధుడు ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటన శనివారం అర్ధరాత్రి జరిగింది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకున్నారు. గాయపడిన ఇద్దరి పరిస్థితి విషమంగా ఉండడం వల్ల జిల్లా ఆస్పత్రికి తరలించామని.. గుడిసెకి మంటలు అంటుకోవడానికి షాట్​ సర్క్యూటే కారణమని పోలీసులు చెబుతున్నారు.

ఇవీ చదవండి:

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.