భారత భూభాగాన్ని ఆక్రమించుకునేందుకు విదేశీ శక్తులను ఎట్టి పరిస్థితుల్లోనూ అనుమతించబోమని ఎయిర్ చీఫ్ మార్షల్ వీఆర్ చౌదరి(Indian Air Force Day) తేల్చి చెప్పారు. భారత వైమానిక దినోత్సవం సందర్భంగా(Air Force Day 2021) దిల్లీలో ఏర్పాటుచేసిన ప్రత్యేక కార్యక్రమంలో ఎయిర్ చీఫ్ మార్షల్ పాల్గొని ప్రసంగించారు(Indian Air Force Day). ఏడాది కాలంగా ఎదురవుతున్న అనేక సవాళ్లను భారత్ దీటుగా ఎదుర్కొందన్న ఆయన.. లద్ధాఖ్‌లో చైనాను ఎదుర్కొన్న తీరు ప్రశంసనీయమని(IAF's 89th foundation day) అభినందించారు.
"భారత భూభాగంలోకి బయటిశక్తులను అనుమతించబోమని మనం దేశానికి చాటి చెప్పాలి. మీకు (భారత వైమానిక దళం) స్పష్టమైన దిశానిర్దేశం, మెరుగైన నాయకత్వం, ఉత్తమ వనరులను అందించడానికి నేను చేయగలిగినదంతా చేస్తానని ప్రతిజ్ఞ చేస్తున్నాను. తూర్పు లద్దాఖ్‌లో పరిణామాలకు ప్రతిస్పందనగా భారత వైమానిక దళం తీసుకున్న సత్వర చర్యలు మన యుద్ధ సంసిద్ధతకు నిదర్శనం. కొవిడ్ సంబంధిత పనులన్నింటినీ పూర్తి చేయడంతో పాటు దేశ ప్రయోజనాలను నెరవేర్చడంలో గొప్ప విజయం సాధించాం. దేశ సార్వభౌమత్వం, సమగ్రతను కాపాడడం మన పవిత్రమైన కర్తవ్యమని మీరు(బలగాలు) గుర్తుంచుకోండి."
వీ.ఆర్.చౌదరి, ఎయిర్ చీఫ్ మార్షల్
ఇవీ చదవండి: