ETV Bharat / bharat

AIMIM UP Election: మజ్లిస్​ను ఆదరించని యూపీ ఓటర్లు

AIMIM UP Election 2022: యూపీ ఎన్నికల్లో ఏఐఎంఐఎం చిత్తుగా ఓడిపోయింది. పార్టీకి దక్కిన ఓట్ల శాతం కేవలం 0.43గా నమోదైంది. యూపీ ప్రజలు మరోసారి భాజపాకు పట్టం కట్టారని.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని అన్నారు ఎంఐఎం అధినేత అసదుద్దీన్​ ఒవైసీ.

AIMIM UP Election 2022
మజ్లిస్
author img

By

Published : Mar 10, 2022, 8:31 PM IST

AIMIM UP Election 2022: ఉత్తర్​ప్రదేశ్​ ఎన్నికల్లో భాజపా గాలికి ఎస్​పీ, కాంగ్రెస్​, మజ్లిస్​ సహా ఇతర పార్టీలు ఘోర పరాజయాన్ని చవిచూశాయి. కాంగ్రెస్​ రెండు స్థానాలకే పరిమితం కాగా.. ముస్లిం ఓటర్లను ఆకర్షించి యూపీలో పాగా వేయాలనుకున్న ఏఐఎంఐఎంకు ఎదురుబెబ్బ తగిలింది. ఈ ఎన్నికల్లో ఆ పార్టీ తరపున బరిలో ఏ ఒక్క అభ్యర్థి కూడా 5వేల ఓట్ల మార్కును దాటలేదు. మొత్తం 403 అసెంబ్లీ స్థానాల్లో నమోదైన ఓట్లలో మజ్లిస్​కు దక్కిన వాటా 0.43 శాతం మాత్రమే.

అజాంగఢ్​ సహా పలు ప్రధాన నియోజకవర్గాల్లో ఎంఐఎం అభ్యర్థులకు చాలా తక్కువ ఓట్లే దక్కాయి. సాయంత్రం 4 గంటల సమయానికి అజాంగఢ్​ అభ్యర్థి కమార్​ కమల్​కు 1368 ఓట్లు, దియోబాంద్​ అభ్యర్థి ఉమైర్​ మద్నికి 3145 ఓట్లు, జాన్​పుర్​ అభ్యర్థి అభయ్​రాజ్​కు 1340 ఓట్లు, కాన్పుర్​ కంటోన్మెంట్​ అభ్యర్థి మోయినుద్దీన్​కు 754 ఓట్లు దక్కాయి.

మరోవైపు లఖ్​నవూ సెంట్రల్​ అభ్యర్థి సల్మాన్​కు 463, మేరఠ్​ అభ్యర్థి ఇమ్రాన్​ అహ్మద్​ 2405, ముజఫర్​నగర్​కు చెందిన మహమ్మద్​ ఇన్తెజార్​కు 2642 ఓట్లు మాత్రమే పడ్డాయి.

ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తాం

ఎంఐఎం ఓటమిపై ఆ పార్టీ అధినేత ఒవైసీ స్పందించారు. యూపీ ప్రజలు మరోసారి భాజపాకు పట్టం కట్టారని.. వారి నిర్ణయాన్ని గౌరవిస్తామని పేర్కొన్నారు.

"అన్నీ రాజకీయ పార్టీలు వారి ఓటమిని కప్పిపుచ్చుకునేందుకు ఈవీఎంలో లోపం ఉందుంటూ ఎత్తిచూపుతున్నారు. కానీ ఆ లోపం ఈవీఎంలో కాదు.. ప్రజల ఆలోచనల్లో ఉంది. మైనార్టీలను ఓటు బ్యాంకుల్లా వాడుకున్నారు... అందుకే వారికి దక్కిన ఈ విజయం 80-20గా ఉంది. పార్టీ కోసం తీవ్రంగా శ్రమించినా ఆశించిన స్థాయిలో ఫలితాలు రాలేదు."

-అసదుద్దీన్​ ఒవైసీ, ఎంఐఎం అధినేత

2017 ఎన్నికల్లో ఒవైసీ.. 38 మంది అభ్యర్థులను బరిలో నిలిపగా 37 స్థానాల్లో అసలు డిపాజిట్​ కూడా దక్కలేదు. అయినా ఈ ఎన్నికల్లో పార్టీని విస్తరించాలన్న లక్ష్యంతో ఈసారి 100 మందిని పోటీకి నిలిపారు. భారత్ ముక్తి మోర్చా అధినేత బాబు సింగ్ కుశ్వాహా నేతృత్వంతో ఐదు పార్టీలతో కలిసి 'భాగీదారీ పరివర్తన్​ మోర్చా' కూటమిగా యూపీ బరిలోకి దిగారు.

బిహార్​ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు ఆశించిన విధంగా రావడం వల్ల.. అదే ఉత్సాహంతో యూపీ ఎన్నికల్లో చక్రం తిప్పాలని ఆశించిన ఒవైసీకి నిరాశే మిగిలింది.

ఛాజర్సీ టోల్​గేట్​ వద్ద ఒవైసీ కారుపై కాల్పులు జరిగిన ఘటన ఎన్నికల ప్రచార సమయంలో దుమారం రేపినా ఫలితాలపై ఎలాంటి ప్రభావం చూపించలేదు.

ఇదీ చూడండి : కాంగ్రెస్​కు 'రావత్' దెబ్బ- రెండు రాష్ట్రాల్లో ఓటమికి ఆయనే కారణం!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.