తృణమూల్ సీనియర్ నాయకుడు, రాష్ట్ర పంచాయతీశాఖ మంత్రి సుబ్రతా ముఖర్జీ(75) తుదిశ్వాస విడిచారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన.. కోల్కతాలోని ఓ ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతిచెందినట్లు బంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు.
" ముఖర్జీ మనతో లేరంటే నమ్మలేకపోతున్నా. ముఖర్జీ ఎంతో నిబద్ధత కలిగిన నాయకుడు. ఆయన మరణం నాకు వ్యక్తిగతంగా లోటు."
-మమతా బెనర్జీ, బంగాల్ సీఎం
గతవారం శ్వాసతీసుకోవటంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడటం వల్ల ముఖర్జీని ఐసీయూకు తరలించినట్లు సంబంధిత వర్గాలు తెలిపాయి.
ఇదీ చూడండి: మూడు నెలల పసికందుతో సహా కుటుంబం మొత్తం ఆత్మహత్య!