ETV Bharat / bharat

'మహా' విలయం- ఒక్కరోజే 67వేల మందికి కరోనా - రాజస్థాన్​లో కరోనా కొత్త కేసులు

దేశవ్యాప్తంగా కరోనా 2.0 విజృంభణ కొనసాగుతోంది. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 67,160 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 676 మంది ప్రాణాలు కోల్పోయారు. ఉత్తర్​ప్రదేశ్​లో ఒక్కరోజే 38,055 కరోనా కేసులు వెలుగు చూశాయి.

corona
వివిధ రాష్ట్రాల్లో కరోనా కొత్త కేసులు
author img

By

Published : Apr 24, 2021, 10:26 PM IST

దేశంలో కొవిడ్​ కల్లోలం కొనసాగుతోంది. రోజువారీ కేసులు రికార్డు స్థాయిలో నమోదవుతున్నాయి. మహారాష్ట్రలో శనివారం ఒక్కరోజే 67,160 మందికి పాజిటివ్​గా నిర్ధరణ అయింది. కరోనాతో మరో 676 మంది మరణించారు. ఒక్క ముంబయి నగరంలోనే.. 5,888 మందికి కరోనా సోకినట్లు తేలింది. కొవిడ్​ కారణంగా మహానగరంలో మరో 71 మంది మరణించారు. నాగ్​పుర్​ జిల్లాలో 7,999 మందికి కరోనా సోకగా.. వైరస్​ దాటికి మరో 82 మంది ప్రాణాలు కోల్పోయారు.

మిగతా రాష్ట్రాల్లో కేసులు ఇలా..

  • ఉత్తర్​ప్రదేశ్​లో వైరస్​ పంజా విసురుతోంది. శనివారం ఒక్కరోజే రికార్డు స్థాయిలో 38,055 కరోనా కేసులు నమోదయ్యాయి. కొవిడ్ ధాటికి మరో 223 మంది మరణించారు.
  • కేరళలో కరోనా ఉద్ధృతి కొనసాగుతోంది. శనివారం ఒక్కరోజే 26,685 కేసులు నమోదయ్యాయి. వైరస్​ కారణంగా 25 మంది బలయ్యారు.
  • గుజరాత్​లో రికార్డు స్థాయిలో ఒక్కరోజే 14,097 కేసులు నమోదయ్యాయి. మరో 152 మంది వైరస్​తో మరణించారు.
  • కర్ణాటకలో కొవిడ్​ పంజా విసురుతోంది. ఒక్కరోజే రికార్డు స్థాయిలో 29,438 మందికి వైరస్ నిర్ధరణ అయింది. వైరస్ కారణంగా మరో 208 మంది బలయ్యారు.
  • తమిళనాడులో కొత్తగా 14,842 మందికి వైరస్​ పాజిటివ్​గా​ నిర్ధరణ అయింది. మరో 80 మంది ప్రాణాలు కోల్పోయారు.
  • రాజస్థాన్​లో కొత్తగా 15,355 మందికి వైరస్​ సోకింది. కొవిడ్​తో మరో 74 మంది మరణించారు.
  • మధ్యప్రదేశ్​లో శనివారం ఒక్కరోజే 12,918 కరోనా కేసులు నమోదయ్యాయి. వైరస్​తో మరో 104 మంది ప్రాణాలు కోల్పోయారు.

ఇదీ చూడండి: భారత్ చేరుకున్న నాలుగు క్రయోజెనిక్‌ ఆక్సిజన్‌ ట్యాంకర్లు

ఇదీ చూడండి: వైరల్​: కొవిడ్​ వార్డులో గిటార్​తో ​స్ఫూర్తి 'గీతం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.