ETV Bharat / bharat

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త.. ఆ ఉద్యోగాల్లో 10 శాతం రిజర్వేషన్​

అగ్నివీరులకు కేంద్రం శుభవార్త చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(BSF)లో 10 శాతం రిజర్వేషన్​ కల్పించనున్నట్లు ప్రకటించింది.

Reservation For Agniveers In BSF
అగ్నివీరులకు బీఎస్​ఎఫ్​లో రిజర్వేషన్​
author img

By

Published : Mar 10, 2023, 12:32 PM IST

Updated : Mar 10, 2023, 1:57 PM IST

అగ్నివీరులకు కేంద్రం తీపికబురు చెప్పింది. మాజీ అగ్నివీరులకు సరిహద్దు భద్రతా దళం(BSF)లో 10 శాతం రిజర్వేషన్​ కల్పించనున్నట్లు ప్రకటించింది. అగ్నివీరులుగా సేవలందించి రిటైర్​ అయ్యే అభ్యర్థులకు బీఎస్ఎఫ్​ నియామకాల్లో ప్రాధాన్యమివ్వనున్నట్లు తెలిపింది. అంతేకాకుండా వీరు అగ్నిపత్​ మొదటి బ్యాచ్ లేదా తర్వాతి బ్యాచ్‌లకు చెందిన వారా అనే దాని ఆధారంగా గరిష్ఠ వయోపరిమితి నిబంధనలను కూడా సడలించింది. దీనికి సంబంధించిన ఉత్తర్వులను కేంద్ర హోం మంత్రిత్వ శాఖ గురువారం విడుదల చేసింది.

సరిహద్దు భద్రతా దళం-1968 చట్టం ప్రకారం నియామక ప్రక్రియను చేపట్టనున్నట్లు అధికారులు వెల్లడించారు. బోర్డర్​ సెక్యూరిటీ ఫోర్స్, జనరల్​ డ్యూటీ కేడర్​-2015లో ఇందుకు సంబంధించి నిబంధనలు సవరించనున్నట్లు కేంద్రం ప్రభుత్వం స్పష్టం చేసింది. సవరించిన నిబంధనలు ఈ నెల 9 నుంచి అమల్లోకి వస్తాయని తెలిపింది.

బీఎస్​ఎఫ్​ నియమకాలకు సంబంధించి అగ్నివీర్​ మొదటి బ్యాచ్​లో చేరి విశ్రాంతి తీసుకునే సైనికులకు 5 సంవత్సరాలు.. ఆ తర్వాతి బ్యాచ్​లలో సేవలందించి రిటైర్​ అయిన అభ్యర్థులకు 3 సంవత్సరాల వరకు గరిష్ఠ వయోపరిమితిని సడలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం పేర్కొంది. అలాగే మాజీ అగ్నివీరులకు బీఎస్​ఎఫ్​ నియామక ప్రక్రియలోని దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపును కల్పించింది ప్రభుత్వం. మొత్తంగా మాజీ అగ్నివీరులకు బీఎస్ఎఫ్​ నియామకాల్లో 10 శాతం రిజర్వేషన్​ను కల్పించిన కేంద్రం.. దీనికి సంబంధించిన నిబంధనలను సవరించనుంది.

అగ్నిపథ్​పై అప్పట్లో నిరసనలు..
అగ్నిపథ్​ స్కీం కింద 25 శాతం మంది సైనికులనే సర్వీసులో కొనసాగేలా తెచ్చిన ఈ పథకంపై గతేడాది దేశవ్యాప్తంగా తీవ్ర వ్యతిరేకత ఎదురైంది. దీంతో నాలుగు సంవత్సరాలు సేవలందించిన మిగతా 75 శాతం మంది సైనికులకు కేంద్ర పారా మిలిటరీ దళాలు, అసోం రైఫిల్స్ వంటి నియామకాల్లో కూడా 10 శాతం రిజర్వేషన్ కల్పించింది కేంద్రం. వీటి నియమకాల్లో కూడా గరిష్ఠ వయోపరిమితి పెంపుతో పాటు ఫిజికల్​ టెస్టుల నుంచి మినహాయింపునిచ్చింది ప్రభుత్వం. ఇక బీఎస్​ఎఫ్​​లోనూ ఈ వెసులుబాటును కల్పిస్తూ ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయంతో అగ్నివీరులకు కొంతమేర ఊరట కలగనుంది.

అయితే కేంద్ర సాయుధ పోలీసు బలగాల(CAPF)నియమకాల కోసం ప్రస్తుతం 18-23 సంవత్సరాల వయసుండాలన్న నిబంధన ఉంది. కానీ, అగ్నివీర్​ పథకం కింద ఓ అభ్యర్థి 17-22 సంవత్సరాల వరకు అగ్నివీర్​గా దరఖాస్తు చేసుకుంటే అతడికి 26 ఏళ్లు వచ్చేంత వరకు దేశ సరిహద్దుల్లో సైనికుడిగా సేవలందిచవచ్చు.

అగ్నివీరులకు వెసులుబాటులు..
నాలుగేళ్లు దేశ సైనికులుగా సేవలందించిన అగ్నివీరులకు.. కేంద్ర సాయుధ పోలీసు బలగాలు(CAPF), అసోం రైఫిల్స్​తో పాటు బీఎస్​ఎఫ్​ నియమకాల్లో వయోపరిమితిని 3, 5 సంవత్సరాలకు పెంచడం సహా దేహదారుఢ్య పరీక్షల నుంచి మినహాయింపు కల్పించడం వల్ల ఉద్యోగార్థులకు కొంత మేర లబ్ధి చేకూరనుంది. హోం శాఖ ఉత్తర్వుల ప్రకారం తొలి అగ్నివీర్​ బ్యాచ్​లోని అభ్యర్థులు 28 సంవత్సరాల వయసు వరకు అగ్నివీర్​గా సేవలందించి.. ఆపై ఇతర కేంద్ర భద్రతా దళాలతో పాటు అసోం రైఫిల్స్​లో చేరేందుకు వీలును కల్పిస్తూ 10 శాతం రిజర్వేషన్​ను ప్రవేశపెట్టింది.

Last Updated : Mar 10, 2023, 1:57 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.