ETV Bharat / bharat

వివేకా హత్య కేసు.. వైఎస్​ అవినాష్​రెడ్డి, భాస్కర్​రెడ్డికి మరోసారి సీబీఐ నోటీసులు

CBI NOTICES TO MP AVINASH REDDY: తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన మాజీ మంత్రి వివేకా హత్య కేసులో సీబీఐ లోతుగా దర్యాప్తు చేస్తోంది. ఈ కేసులో ఇప్పటికే ఆరోపణలు ఎదుర్కొంటున్న ఎంపీ అవినాష్​ రెడ్డిని రేపు విచారణకు రావాలని మరోసారి నోటీసులు జారీ చేసింది.

cbi notices to mp avinash reddy
cbi notices to mp avinash reddy
author img

By

Published : Mar 5, 2023, 6:21 AM IST

Updated : Mar 5, 2023, 6:57 AM IST

CBI NOTICES TO MP AVINASH REDDY: మాజీ మంత్రి వైఎస్​ వివేకానందరెడ్డి హత్య కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ దూకుడు ప్రదర్శిస్తోంది. ఈ కేసులో నిజనిజాలే లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ఈ కేసులో ఇప్పటికే పలువురిని ప్రశ్నించింది. వివేకా హత్య కేసులో ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్​ రెడ్డికి మరోసారి నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే రెండు సార్లు విచారణ జరిపిన సీబీఐ.. తాజాగా మరోసారి విచారణ చేపట్టనున్నారు.

వివేకా హత్య కేసులో రేపు(మార్చి 6) విచారణకు రావాలని నోటీసులు జారీ చేసింది. హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. వైఎస్సార్​ జిల్లా పులివెందులలోని ఆయన నివాసానికి వెళ్లి నోటీసులు ఇచ్చారు. రేపు విచారణకు రాలేనని అవినాష్​ చెప్పగా.. రేపు కచ్చితంగా విచారణకు రావాల్సిందేనని స్పష్టం చేసింది.

CBI NOTICES TO YS BHASKAR REDDY: మరోవైపు అవినాష్​ తండ్రి వైఎస్​ భాస్కర్​ రెడ్డికి సైతం సీబీఐ అధికారులు నోటీసులు జారీ చేశారు. నాలుగు రోజుల కిందట ఈ నెల 12న విచారణకు రావాలని తెలిపిన సీబీఐ అధికారులు.. మరోసారి నోటీసులు ఇచ్చి ఈ నెల 6వ తేదీనే రావాలన్నారు. కడప కేంద్ర కారాగారం అతిథి గృహంలో విచారణకు రావాలని నోటీసుల్లో పేర్కొంది. నిన్న రాత్రి పులివెందులకు వెళ్లి ఆరవ తేదీనే విచారణకు రావాలని స్పష్టం చేసింది. తండ్రి, కుమారులు ఇద్దరిని ఆరవ తేదీన విచారించనుంది. అయితే సీబీఐ విచారణపై ఆసక్తి నెలకొంది.

వివేకా హత్య కేసులో ఎంపీ అవినాష్​ రెడ్డి హస్తంపై సీబీఐ అధికారులు లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు విచారించిన సీబీఐ.. రేపు మరోసారి విచారించనున్నారు. జనవరి 28న మొదటిసారి విచారించిన సీబీఐ.. పలు కీలక అంశాలను సేకరించినట్లు సమాచారం. గత నెల ఫిబ్రవరి 24న రెండోసారి ప్రశ్నించింది. ఇప్పటి వరకూ.. తమ దర్యాప్తులో వెల్లడైన అంశాల ఆధారంగా సిద్ధం చేసిన ప్రశ్నలను ఆయనపై సంధించింది.

VIVEKA MURDER CASE LATEST UPDATES: కేసు దర్యాప్తు అధికారిగా వ్యవహరిస్తున్న సీబీఐ ఎస్పీ రాంసింగ్‌ ఆధ్వర్యంలోని ముగ్గురు సభ్యుల బృందం.. అవినాష్‌రెడ్డిని ప్రశ్నించింది. ప్రధానంగా వివేకానందరెడ్డి హత్య జరిగిన రోజు., ఆ తర్వాత జరిగిన సంఘటనల గురించే ప్రశ్నలు అడిగినట్లు సమాచారం. ఈ కేసులో..నిందితుడు సునీల్‌ యాదవ్‌ పెట్టుకున్న బెయిల్‌ పిటిషన్‌పై దాఖలు చేసిన కౌంటర్‌లో.. అనేక సంచలన విషయాలు పేర్కొన్న CBI, అందులో అవినాష్‌రెడ్డి గురించి.. చాలా సార్లు ప్రస్తావించింది. వివేకా హత్య కేసులో అవినాష్‌రెడ్డి పాత్రను మొదటి నుంచి అనుమానిస్తున్న సీబీఐ.. గత నెల 28న మొదటిసారి విచారించింది.

హైదరాబాద్‌లోని సీబీఐ కార్యాలయానికి పిలిపించి అవినాష్‌ రెడ్డి వాంగ్మూలాన్ని నమోదు చేసింది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణకు రావాలని నోటీసులో పేర్కొన్నప్పటికీ, అవినాష్‌రెడ్డి.. 12 గంటల 45 నిమిషాలకే ఆఫీసుకు వచ్చారు. వివేకా హత్య జరిగిన రోజు నిందితుడు సునీల్‌ యాదవ్‌.. ఎంపీ అవినాష్‌రెడ్డి ఇంట్లో ఉన్నాడని.. కదిరి నుంచి దస్తగిరి గొడ్డలి కొనుక్కొని వచ్చాడని.., దాంతోనే వివేకాను హత్య చేశారని అభియోగాలు మోపిన సీబీఐ, దీనికి సంబంధించి అవినాష్‌రెడ్డిని పలు ప్రశ్నలు అడిగినట్లు తెలుస్తోంది. అయితే.. తాము దర్యాప్తు చేపట్టే నాటికే చాలా వరకూ ఆధారాలు నాశనమయ్యాయని.. సీబీఐ అభిప్రాయం వ్యక్తం చేస్తోంది.

ఇవీ చదవండి:

Last Updated : Mar 5, 2023, 6:57 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.