ETV Bharat / bharat

మాజీ సీజేఐపై ధిక్కార చర్యలకు ఏజీ నిరాకరణ

భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి, రాజ్యసభ సభ్యుడు జస్టిస్​ రంజన్​ గొగొయిపై ధిక్కార చర్యలు చేపట్టేందుకు నిరాకరించారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. ఆయన మాటలు న్యాయవ్యవస్థలో లోపాలను ప్రతిబింబిస్తున్నాయే తప్ప.. అపకీర్తి తెచ్చేవిగా లేవని పేర్కొంటూ సామాజిక కార్యకర్త సాకెత్​ గోఖలేకు సమాధానం పంపారు.

CJI Ranjan Gogoi
మాజీ సీజేఐపై ధిక్కార చర్యలకు ఏజీ నిరాకరణ
author img

By

Published : Feb 27, 2021, 3:20 PM IST

Updated : Feb 27, 2021, 5:41 PM IST

సుప్రీం న్యాయవ్యవస్థపై అనుచిత వ్యాఖ్యలు చేశారన్న ఆరోపణలతో మాజీ సీజేఐ, రాజ్యసభ సభ్యుడు జస్టిస్​ రంజన్​ గొగొయిపై ధిక్కార చర్యలు చేపట్టాలన్న వాదనలను తోసిపుచ్చారు అటార్నీ జనరల్​ కేకే వేణుగోపాల్​. ఆయన మాటలు న్యాయవ్యవస్థలో లోపాలను ప్రతిబింబిస్తున్నాయని స్పష్టం చేశారు.

న్యాయవ్యవస్థ దీన స్థితిలో ఉందని, సరైన సమయంలో న్యాయం జరిగే పరిస్థితి లేదని ఓ కార్యక్రమంలో మాజీ సీజేఐ పేర్కొన్నారు. దీనిపై నేర ధిక్కార చర్యలు చేపట్టేందుకు అనుమతించాలని అటార్నీ జనరల్​ను కోరారు సామాజిక కార్యకర్త సాకెత్​ గోఖలే. ఈ క్రమంలో చర్యలు చేపట్టేందుకు నిరాకరిస్తూ గోఖలేకు లేఖ రాశారు వేణుగోపాల్​.

" ఇంటర్వ్యూ మొత్తాన్ని చూశా. ఆయన మాట్లాడింది న్యాయవ్యవస్థ మంచి కోసమేనని తెలుస్తోంది. ఏ విధంగానైనా కోర్టును అపకీర్తి చేయదు. చట్టం దృష్టిలో దాని అధికారాన్ని తగ్గించదు. న్యాయవ్యవస్థలోని లోపాలను మాజీ సీజేఐ మాటలు ప్రతిబింబిస్తున్నాయి. "

- కేకే వేణుగోపాల్​, అటార్నీ జనరల్​

కోర్టు ధిక్కరణ చట్టం, నిబంధనల ప్రకారం వ్యక్తులపై క్రిమినల్​ ధిక్కార కేసు వేసేందుకు అటార్నీ జనరల్​ లేదా సొలిసిటర్​ జనరల్​ సమ్మతి కావాలి.

ఇదీ చూడండి: రాజ్యసభ సభ్యునిగా జస్టిస్​ గొగొయి ప్రమాణం

Last Updated : Feb 27, 2021, 5:41 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.