బంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ తాను పోటీ చేస్తున్న నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. నందిగ్రామ్‌లోని రెయ్‌పారా ప్రాంతంలో ఈ గృహాలు ఉన్నాయి. త్వరలోనే తాను నందిగ్రామ్‌లో శాశ్వత నివాసం కూడా ఏర్పాటు చేసుకుంటానని ఆదివారం ఎన్నికల ర్యాలీలో ఆమె ప్రకటించారు.
మమత ఏడాది కోసం ఓ ఇంటిని, ఆర్నెళ్ల కోసం మరో ఇంటిని అద్దెకు తీసుకున్నట్లు స్థానికులు తెలిపారు. ఈ రెండు ఇళ్లకు మధ్య దూరం కేవలం 100 మీటర్లే.
ఇదీ చూడండి: మమత స్థానచలనం వెనక మతలబేంటి?
మమత బయటి నుంచి వచ్చిన వ్యక్తి అంటూ ప్రత్యర్థి, భాజపా అభ్యర్థి సువేందు అధికారి పదే పదే ఆరోపణలు చేస్తుండగా ఆమె ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం. మమత నందిగ్రామ్‌కు చెందిన వ్యక్తి కాదంటూ నామినేషన్ వేసిన వెంటనే సువేందు ఆరోపించారు.
ఇదీ చూడండి: 'భాజపా ఉచిత రేషన్ హామీ.. ఓ పెద్ద అబద్ధం'