ETV Bharat / bharat

Serum: ఫైజర్, మోడెర్నా​ బాటలోనే సీరం!

దేశీయ ఫార్మా దిగ్గజం, కొవిషీల్డ్‌ తయారీ సంస్థ సీరం(Serum) ఇనిస్టిట్యూట్‌ ఆఫ్‌ ఇండియా కేంద్ర ప్రభుత్వం నుంచి ఇండెమ్నిటీ రక్షణ కోరుతోంది. ఇప్పటికే విదేశీ సంస్థలైన ఫైజర్​, మోడెర్నా తమ వ్యాక్సిన్లకు ఇండెమ్నిటీ (indemnity) ప్రకటించమని విజ్ఞప్తి చేశాయి.

serum institute indemnity, వ్యాక్సిన్లకు భద్రత
ఫైజర్, మోడెర్నా​ బాటలోనే సీరం!
author img

By

Published : Jun 3, 2021, 11:51 AM IST

తాము ఉత్పత్తి చేస్తున్న వ్యాక్సిన్లకు కేంద్రం ఇండెమ్నిటీ(indemnity) ప్రకటించాలని సీరం సంస్థ(Serum) విజ్ఞప్తి చేసినట్లు సమాచారం. ఒకవేళ విదేశీ తయారీ సంస్థలకు చట్టపరమైన చిక్కుల నుంచి రక్షణ కల్పిస్తే సీరంతో(Serum) దేశీయ వ్యాక్సిన్‌ ఉత్పత్తిదారులకు కూడా అలాంటి రక్షణే ఇవ్వాలని కోరినట్లు సదరు వర్గాలు పేర్కొన్నాయి. అన్ని వ్యాక్సిన్ సంస్థలకు ఈ ఇండెమ్నిటీని ప్రకటించాలని సీరం వర్గాలు అభిప్రాయపడ్డాయి.

భారత్​లో వ్యాక్సిన్లు పంపిణీ చేయాలంటే ఇండెమ్నిటీ (indemnity) ప్రకటించాలని ఇటీవల విదేశీ వ్యాక్సిన్​ సంస్థలైన ఫైజర్​, మోడెర్నా కేంద్రాన్ని కోరాయి. ఆ సంస్థల విజ్ఞప్తిని ప్రభుత్వం సానుకూలంగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది.

ఇండెమ్నిటీ ప్రకటిస్తే టీకాలు సరఫరా చేశాక వాటిపై ఏమైనా న్యాయపరమైన చిక్కులు, నష్టపరిహారాల అంశాలు వస్తే భారత ప్రభుత్వమే బాధ్యత వహించాలి.

ఇదీ చదవండి : Corona Vaccine: విదేశీ టీకాల రాకకు లైన్‌క్లియర్‌..!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.