ETV Bharat / bharat

ఆ పాఠశాలలో 33మంది విద్యార్థులు, టీచర్​కు కరోనా - కరోనా అప్డేట్​

కొవిడ్(Corona virus)​ నుంచి కోలుకుని ఇప్పుడిప్పుడే పాఠశాలలు తెరుకుంటున్నాయి. ఈ క్రమంలోనే ఒకే పాఠశాలలో 33 మంది విద్యార్థులు, ఓ ఉపాధ్యాయుడికి వైరస్​ నిర్ధరణ(Covid-19 news) కావటం ఆందోళన కలిగిస్తోంది. కర్ణాటక, బెంగళూరు అర్బన్​ జిల్లాలోని ఓ బోర్డింగ్​ పాఠశాలలో ఈ కేసులు(Covid-19 karnataka) వెలుగుచూశాయి.

students tested Covid positive
పాఠశాలలో తనిఖీ చేస్తున్న అధికారులు
author img

By

Published : Nov 26, 2021, 10:18 PM IST

కరోనా మహమ్మారి మరోమారు విజృంభిస్తోంది. కర్ణాటక, ధార్వాడ్​లోని వైద్య కళాశాలలో 182 మందికి వైరస్​ సోకిన సంఘటన వెలుగు చూసిన కొద్ది గంటల్లోనే.. అదే రాష్ట్రంలోని ఓ పాఠశాలలో భారీగా కేసులు బయటపడ్డాయి. బెంగళూరు అర్బన్​​ జిల్లా, అనెకల్​ తాలుకలోని దొమ్మసంద్రలోని బోర్డింగ్​ పాఠశాలలో 33 మంది విద్యార్థులు సహా ఓ ఉపాధ్యాయుడికి కొవిడ్​-19 వైరస్​ పాజిటివ్​గా(Covid-19 latest news) తేలింది.

students tested Covid positive
పాఠశాలలో జిల్లా ఆరోగ్య శాఖ అధికారులు

"దొమ్మసంద్రలోని ది ఇంటర్​నేషనల్​ బెంగళూరు బోర్డింగ్​ పాఠశాలలో సుమారు 300 మంది విద్యార్థులు చదువుకుంటున్నారు. ప్రస్తుతం 282 మంది హాజరవుతున్నారు. కొంత మంది మహదేవపుర నుంచి పాఠశాలకు వస్తున్నారు. వారి నుంచే కరోనా వ్యాపించి ఉంటుందని భావిస్తున్నాం. "

- విజయ్​ కుమార్​, ఆరోగ్య అధికారి.

కరోనా నిర్ధరణ(Corona virus latest news) అయిన విద్యార్థులు, ఉపాధ్యాయుడిని పాఠశాలలోనే క్వారంటైన్​లో ఉంచారు. జిల్లా ఆరోగ్య విభాగం అధికారులు పాఠశాలను సందర్శించారు.

students tested Covid positive
ఉపాధ్యాయులతో మాట్లాడుతున్న జిల్లా అధికారులు

కొద్ది రోజులుగా కరోనా మళ్లీ విజృంభిస్తున్న తరుణంలో భౌతిక తరగతులను మూసివేస్తున్నారు అధికారులు. ఈ క్రమంలోనే ఈ స్థాయిలో కేసులు నమోదు కాటవం ఆందోళన కలిగిస్తోంది.

కొంప ముంచిన ఫ్రెషర్స్​ పార్టీ...

రాష్ట్రంలో కేసులు భారీగా వెలుగులోకి వస్తున్నాయి. అంతకుముందు.. వైద్య కళాశాలో నవంబరు 17న జరిగిన ఫ్రెషర్స్​ పార్టీనే కరోనా విజృంభణకు కారణమని వైద్యాధికారి నితేశ్​ కె. పాటిల్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం పాల్గొన్నారని వివరించారు. గురువారం మొత్తం 300 మందికి పైగా వైద్యపరీక్షలు నిర్వహించగా.. 66 మంది వైరస్ బారిన(Covid-19 karnataka) పడ్డారన్నారు. ప్రస్తుతం ఆ సంఖ్య 182కు చేరినట్లు పేర్కొన్నారు. కొవిడ్ సోకిన వారిని క్వారంటైన్​లో ఉంచి చికిత్స అందిస్తున్నామని తెలిపారు. మరికొంతమంది విద్యార్థులకు శుక్రవారం పరీక్షలు నిర్వహిస్తామన్నారు. విద్యార్థుల శాంపిల్స్​ను జీనోమ్ సీక్వెన్​సింగ్ కోసం పంపిస్తామన్నారు. ఇప్పటికే క్యాంపస్​లోని రెండు హాస్టళ్లను శానిటైజ్ చేసినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: కరోనా కొత్త వేరియంట్​పై భారత్ కీలక ప్రకటన​- ఆ దేశాల్లో ఆంక్షలు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.